Hanuman Movie : దుమ్మురేపిన " హను మాన్ " టీజర్... అదరగొట్టిన తేజసజ్జా !
Hanuman Movie : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ... విలక్షణ కథలను తెరకెక్కిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. విభిన్న కధలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ప్రస్తుతం ప్రశాంత్ డైరెక్షన్ లో తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న చిత్రం " హను మాన్ ". ఫస్ట్ ఎవర్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రంగా ఇది తెరకెక్కుతుంది. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ , వినయ్ రాయ్, రాజ్, దీపక్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ గ్లిమ్స్ అండ్ మోషన్ పోస్టర్స్ మూవీపై ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించాయి. ఇక ఈ మూవీ టీజర్ ని 15వ తేదీన విడుదల చేయాలనీ అనుకున్నారు. అయితే సూపర్‌స్టార్ కృష్ణ కన్నుమూయడంతో టీజర్ విడుదలని వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని మూవీ యూనిట్ విడుదల చేశారు. ఇక టీజర్ లోని విజువల్స్ చూస్తుంటే అదరహో అనేలా ఉన్నాయి.
టీజర్ లో గ్రాఫిక్స్ అదిరిపోయాయని చెప్పాలి. ఇక టీజర్‌లో ఎండ్‌లో.. హనుమంతుడు గుహలో రామజపం చేస్తున్న సీన్ అయితే గూస్‌బంప్స్ రప్పించింది. అలాగే టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హను-మాన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే మూవీ విడుదల తేదీని ప్రకటిస్తామని మూవీ యూనిట్ తెలిపారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.