FILM NEWS: జులై 30న గ్రాండ్‌గా విడుదలవుతున్న తేజ సజ్జా, ప్రియా వారియర్, "ఇష్క్"
Teja Sajja, Priya Varrier, Mega Super Good Films "ISHQ" To Release On July 30th, SS Raju, Latest Telugu Movies, Telugu World Now,
FILM NEWS: జులై 30న గ్రాండ్‌గా విడుదలవుతున్న తేజ సజ్జా, ప్రియా వారియర్, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ `ఇష్క్`.
సౌత్ ఇండియాలోని ప్రతిష్ఠాత్మక బ్యానర్లలో ఒకటైన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఇటీవల 'జాంబీ రెడ్డి' మూవీతో సూపర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ సజ్జాతో 'ఇష్క్` చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.. నాట్ ఎ లవ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి యస్.యస్. రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.బి. చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్,ట్రైలర్, సాంగ్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రాన్ని జులై30న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
మహతి స్వరసాగర్ బాణీలు సమకూరుస్తున్నారు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా, ఎ. వరప్రసాద్ ఎడిటర్‌గా, విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు.
తారాగణం:
తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్
సాంకేతిక బృందం:
డైరెక్టర్: యస్.యస్. రాజు
నిర్మాతలు: ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్
సమర్పణ: ఆర్.బి. చౌదరి
బ్యానర్: మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్
మ్యూజిక్: మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు
ఎడిటింగ్: ఎ. వరప్రసాద్
ఆర్ట్: విఠల్ కొసనం
లిరిక్స్: శ్రీమణి
పీఆర్వో: వంశీ-శేఖర్.

