For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంపై వీడియోను చేసిన మేజర్ టీమ్

08:31 AM Mar 16, 2022 IST | Sowmya
Updated At - 08:31 AM Mar 16, 2022 IST
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంపై వీడియోను చేసిన మేజర్ టీమ్
Advertisement

నటుడు అడివి శేష్ మొదటి పాన్ ఇండియా చిత్రం `మేజర్` మే 27న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో వేసవి కానుక‌గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించబడింది. మలయాళంలో కూడా విడుదల కానుంది.

మార్చి 15న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జయంతి. 26/11 సంఘ‌ట‌న హీరోగా నిలిచిన మేజ‌ర్‌ 45వ జ‌యంతి సందర్భంగా, మేజర్ బృందం అతని జీవితంపై హృదయపూర్వకమైన నివాళిని వీడియో రూపంలో తెలియ‌జేస్తుంది.

Advertisement GKSC

ఈ వీడియో కేవలం మేజర్ జీవితంలోని వివిధ దశలను చూపడమే కాకుండా, ఆ పాత్రను అడివి శేష్‌ తో చిత్రీకరించిన మరపురాని సంఘటనలను కూడా చూపుతుంది. ఇందులో మేజర్‌కి తన తల్లితో ఉన్న ఆప్యాయత, సోదరితో అతని బంధం, స్నేహితులతో గ‌డిపిన అత్యుత్తమ క్షణాలు, శిక్షణా రోజులు, చివరకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌లో అధికారిగా అతని అనుభవాలను వివరిస్తుంది.Team Major Brings Heartfelt Reflection On Major Sandeep Unnikrishnan’s Life, On His 45th Birth Anniversary,,telugu golden tv, my mix entertainments, teluguworldnow.com.1చివ‌రివ‌ర‌కు ఇమేజెస్‌లో మేజర్‌లోనూ, శేష్‌లోనూ మనకు పెద్దగా తేడాలు కనిపించవు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జ‌యంతి సందర్భంగా ఈ వీడియో ఒక సంపూర్ణ గుర్తింపుగా నిలుస్తుంది.

Advertisement
Author Image