For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా ‘గుడ్ లక్ సఖి’ టీం నుంచి స్పెషల్ పోస్టర్ విడుద‌ల‌

07:02 AM Oct 18, 2021 IST | Sowmya
Updated At - 07:02 AM Oct 18, 2021 IST
film news  కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా ‘గుడ్ లక్ సఖి’ టీం నుంచి స్పెషల్ పోస్టర్ విడుద‌ల‌
Advertisement

FILM NEWS:కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా ‘గుడ్ లక్ సఖి’ టీం నుంచి స్పెషల్ పోస్టర్ విడుద‌ల‌

Team Good Luck Sakhi Wishes Keerthy Suresh On Her Birthday, Film Releasing In November, Keerthy Suresh, Aadhi Pinishetty, Jagapathi Babu, Latest Telugu Movies, Telugu World Now,

Advertisement GKSC

జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో ప్రేక్షకులను అల‌రించ‌నున్నారు. ఈ క్రమంలోనే గుడ్ లక్ సఖి సినిమాతో కీర్తి సురేష్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాబోతోన్నారు. ఇందులో ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రావ్యా వర్మ సహ నిర్మాతగా ఈ చిత్రం రాబోతోంది.

నేడు (అక్టోబర్ 17) కీర్తి సురేష్ బర్త్ డే. ఈ క్రమంలో గుడ్ లక్ సఖి టీం నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. గురి చూసి కొడుతున్నట్టుగా ఉన్న కీర్తి సురేష్ పోస్టర్‌లో క‌నిపిస్తున్నారు. గన్నుతో గురి చూసి కొడుతున్న కీర్తి సురేష్ అభిమానులను కట్టిపడేశారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ గ్రామీణ అమ్మాయిగా కనిపించనుంది. ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో కీర్తి సురేష్ షూటర్‌గా నటించారు.

నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టు ఈ కొత్త పోస్టర్‌ ద్వారా ప్రకటించారు.

నాగేశ్ కుకునూర్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మళయాల భాషల్లో ఒకే సారి విడుదలచేయబోతోన్నారు.

దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ మీద సుధీర్ చంద్ర పదిరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. చిరంతన్ దాస్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

నటీనటులు : కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు తదితరులు

సాంకేతికబృందం:

డైరెక్టర్ : నాగేశ్ కుకునూర్
సమర్ఫణ : దిల్ రాజు (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
బ్యానర్ : వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్
నిర్మాత : సుధీర్ చంద్ర పదిరి
సహ నిర్మాత : శ్రావ్యా వర్మ
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫర్ : చిరంతన్ దాస్
పీఆర్వో : వంశీ-శేఖర్

Team Good Luck Sakhi Wishes Keerthy Suresh On Her Birthday, Film Releasing In November,Keerthy Suresh, Aadhi Pinishetty, Jagapathi Babu,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com

Advertisement
Author Image