For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: "వరుణ్ తేజ్" పుట్టిన‌రోజు సందర్భంగా "ఎఫ్ 3" నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్

08:12 PM Jan 19, 2022 IST | Sowmya
Updated At - 08:12 PM Jan 19, 2022 IST
film news   వరుణ్ తేజ్  పుట్టిన‌రోజు సందర్భంగా  ఎఫ్ 3  నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్
Advertisement

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి సమ్మర్ సోగ్గాళ్లుగా వేసవికి మూడు రెట్ల వినోదాన్ని ఇచ్చేందుకు ఎఫ్ 3 సినిమాతో రాబోతోన్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ నిర్మిస్తున్నారు.

వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఎఫ్ 3 టీం నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్‌ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో వరుణ్ సరికొత్తగా కనిపిస్తున్నారు. ఈ సినిమా అంతా కూడా డబ్బు చుట్టూ తిరుగుతుందని ఇది వరకే తెలిపింది చిత్రయూనిట్. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లోనూ వరుణ్ తేజ్ చేతిలో కరెన్సీ నోట్లు కనిపిస్తున్నాయి.

Advertisement GKSC

వేసవి సందర్భంగా ఏప్రిల్ 28న ఈ చిత్రం విడుదల కానుంది. ఇది వరకు ఏప్రిల్ 29న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ దాని కంటే ఒక రోజు ముందే అంటే ఏప్రిల్ 28న సినిమాను రిలీజ్ చేయబోతోన్నారు.

2019 సంక్రాంతి విన్నర్‌గా ఎఫ్ 2 నిలిచింది. ఇక ఎఫ్ 3 అయితే సమ్మర్‌లో వినోద విందు చేసేందుకు రాబోతోంది. సినిమా మీద అంచనాలు, పాజిటివ్ బజ్‌కు తగ్గట్టే అంచనాలను మించి ఉండబోతోంది.

నటీనటులు: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు.

సాంకేతిక బృందం : డైరెక్టర్: అనిల్ రావిపూడి, సమర్పణ: దిల్ రాజు, నిర్మాత: శిరీష్, బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి, సంగీత : దేవీ శ్రీ ప్రసాద్, కెమెరామెన్: సాయి శ్రీరామ్, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటింగ్: తమ్మిరాజు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: ఎస్ కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్

Advertisement
Author Image