For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Chandrababu : తెలుగు సినీ పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది: టీడీపీ అధినేత చంద్రబాబు

12:36 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:36 PM May 13, 2024 IST
chandrababu   తెలుగు సినీ పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది  టీడీపీ అధినేత చంద్రబాబు
Advertisement

Chandrababu : సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదాన్ని నింపింది. మాటలకందని మహా విషాదాన్ని తెలుగు సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. ఒక పెద్ద దిక్కును కోల్పోయామని పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ బాధను వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కృష్ణ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఆ పోస్ట్ లో సినీ, రాజకీయ జీవితంలో సూపర్‌స్టార్‌ పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా, సూపర్‌స్టార్ గా పిలిపించుకున్న నటులు, మాజీ ఎంపీ కృష్ణ గారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. నటుడిగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహస నిర్మాతగా కృష్ణగారిని చెప్పుకుంటారు. టాలీవుడ్ జేమ్స్ బాండ్ గా, విలక్షణ నటునిగా పేరున్న కృష్ణ మృతి సినీ రంగానికి తీరని లోటు.

Advertisement GKSC

కృష్ణగారి మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసినట్లయింది. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిన మహేష్ బాబుకు ఇది తీరని వేదన. ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని ఆయనకు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు మహేష్ బాబు నివాసంలో కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించి మహేష్ ను ఓదార్చారు.

Advertisement
Author Image