For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tarun Bhaskar : తరుణ్ భాస్కర్ మరో మ్యాజిక్ తో సిద్ధం .. ‘కీడా కోలా’ అనే ఇంట్రస్టింగ్ సినిమాతో ఎంట్రీ ....

10:10 AM Jun 29, 2023 IST | Sowmya
Updated At - 10:10 AM Jun 29, 2023 IST
tarun bhaskar   తరుణ్ భాస్కర్  మరో మ్యాజిక్ తో సిద్ధం    ‘కీడా కోలా’ అనే ఇంట్రస్టింగ్ సినిమాతో ఎంట్రీ
Advertisement

Keedaa Cola : టాలీవుడ్ లో ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన క్రేజీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈసారి మరో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ‘కీడా కోలా’ అనే ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ దర్వకత్వం చేయబోతున్నారాయన. తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. మూవీ టీజర్ ను అఫీషియల్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తరుణ్ భాస్కర్ సినిమాలు అన్నీ చాలా ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లే ఉంటాయి. ఈ ‘కీడా కోలా’ కూడా అలాగే కనిపిస్తోంది. ఇక ఈ సినిమా టీజర్ విషయానికొస్తే.. ఒక డిఫరెంట్ కథాంశంతో సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. టీజర్ లో ప్రారంభంలో కీడా కోలా అనే లిక్విడ్ బాటిల్ ను చూపించారు. అందులో ఓ బొద్దింక ఇరుక్కుపోయినట్లు చూపించారు. తర్వాత బ్రహ్మనందం, చైతన్య మధ్య జరిగే సంభాషణలను చూపించారు. ‘అరేయ్ ఏంట్రా ఇది’ అని బ్రహ్మానందం అడుగుతుంటే ‘గ్రెేప్స్ ఏమో’ అని చైతన్య అమాయకంగా సమాధానం చెప్పడం దానికి బ్రహ్మనందం చైతన్యపై ఓ డైలాగ్ వేయడం, బ్రహ్మానందం డైలాగ్ కు చైతన్య కౌంటర్ ఇవ్వడం వంటివి చూపించారు.

Advertisement GKSC

ఈ సినిమా స్టోరీ మొత్తం కీడా కోలా చుట్టూనే తిరుగుతుంది అని తెలుస్తోంది. తర్వాత కొన్ని యాక్షన్ సీన్ లు చూపించారు. ఇంతకీ ఆ కోలాలో బొద్దింక ఎలా ఇరుక్కుంది, దానికోసం ఎందుకు అందరూ పోటీపడుతున్నారు. వంటి అంశాలను థియేటర్లలో చూడాల్సిందే. ఈ మూవీలో తరుణ్ కూడా నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. టీజర్ చివర్లో “శ్వాస మీద ధ్వాసతో.. ఒస్తున్నాం” అంటూ ఇంట్రస్టింగ్ గా కట్ చేశారు.

Advertisement
Author Image