For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: నీలిరంగు కళ్లతో, పొడవాటి జుట్టుతో, స్టైలీష్ లుక్‌ లో రవితేజ 70వ చిత్రం "రావణాసుర" లో "సుశాంత్"

09:50 PM Jan 11, 2022 IST | Sowmya
Updated At - 09:50 PM Jan 11, 2022 IST
film news  నీలిరంగు కళ్లతో  పొడవాటి జుట్టుతో  స్టైలీష్ లుక్‌ లో రవితేజ 70వ చిత్రం  రావణాసుర  లో  సుశాంత్
Advertisement

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రానికి రావణాసుర అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రవితేజ 70వ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్ల మీద అభిషేక్ నామా అత్యంత భారీగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను మేకర్లు ప్రకటించారు. ఈ చిత్రంలో రామ్ అనే ముఖ్య పాత్రలో సుశాంత్ నటించనున్నారు. అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుశాంత్.. రావణాసుర కథ, స్క్రిప్ట్, పాత్ర నచ్చి వెంటనే ఓకే చెప్పారు. సుశాంత్ అప్పియరెన్స్ ఈ సినిమాకు బోనస్ కానుంది.

Advertisement GKSC

తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సుశాంత్ నీలిరంగు కళ్లతో, పొడవాటి జుట్టుతో, స్టైలీష్ లుక్‌లో కనిపించారు. రామ్ పాత్రలో సుశాంత్ నటిస్తున్నారు.. హీరోలు లేరు అనే క్యాప్షన్‌తో సినిమా వస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పోస్టర్‌ను చూస్తుంటే సుశాంత్ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు కనిపిస్తోంది.

కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న రవితేజ 70వ ప్రాజెక్ట్‌ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఉండబోతోంది. ఇక ఈ చిత్రానికి ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేయబోతోన్నారు.Sushanth’s First Look As Ram In #RaviTeja70 , Sudheer Varma, Abhishek Nama’s Ravanasura Unveiled,Latest Telugu Movies,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com.1నటీనటులు : రవితేజ, సుశాంత్

సాంకేతిక బృందం :

డైరెక్టర్ : సుధీర్ వర్మ
నిర్మాత : అభిషేక్ నామా
బ్యానర్ : అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్
స్టోరీ : శ్రీకాంత్ విస్సా
పీఆర్వో : వంశీ-శేఖర్

Advertisement
Author Image