For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: మోహన్ లాల్ ‘మరక్కార్‌’ను డిసెంబర్ 2 తెలుగులో రిలీజ్ చేయనున్న సురేష్ ప్రొడక్షన్స్‌

04:01 PM Nov 22, 2021 IST | Sowmya
Updated At - 04:01 PM Nov 22, 2021 IST
film news  మోహన్ లాల్ ‘మరక్కార్‌’ను డిసెంబర్ 2 తెలుగులో రిలీజ్ చేయనున్న సురేష్ ప్రొడక్షన్స్‌
Advertisement

మళయాలం సూపర్ స్టార్ మోహన్ లాల్ భారీ చిత్రం మరక్కార్. అరేబియా సముద్ర సింహ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం  డిసెంబర్ 2ను విడుదల కానుంది. ప్రియదర్శన తెరకెక్కిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌ మళయాంలో భారీ ఎత్తున నిర్మించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌ మీద ఎన్నో మంచి చిత్రాలను నిర్మించి, రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆంటోని పెరంబువూర్ ఈ సినిమాను కాన్ఫిడెంట్ గ్రూప్ సంస్థతో కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

మరక్కార్ తెలుగు హక్కులను టాలీవుడ్ నెంబర్ వన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్ దక్కించుకుంది. తెలుగులో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. మోహన్ లాల్‌కు తెలుగులో ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన హీరోగా వచ్చిన మన్యం పులి సినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది. జనతా గ్యారెజ్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి.

Advertisement GKSC

అర్జున్, సునీల్ శెట్టి, కిచ్చా సుదీప్, ప్రభు, మంజు వారియర్, కీర్తి సురేష్, కళ్యాణి ప్రయదర్శన్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. రొన్నీ రాఫెల్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. కనులను కలిపినా అంటూ వచ్చిన మొదటి పాటకు విశేషమైన స్పందన లభించింది.

Suresh Productions To Release Mohanlal’s Marakkar Grandly In Telugu On December 2nd,Director Priyadarshan,Malayalam Dubbing Movies,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com.1

Advertisement
Author Image