For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Movie Updates: మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న "సూపర్ స్టార్ మహేష్ బాబు" "సర్కారు వారి పాట"

11:07 PM Jan 31, 2022 IST | Sowmya
UpdateAt: 11:07 PM Jan 31, 2022 IST
movie updates  మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న  సూపర్ స్టార్ మహేష్ బాబు   సర్కారు వారి పాట
Advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్‌ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ `సర్కారు వారి పాట` చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. తాజాగా మేకర్లు ఈ మూవీని మే 12న విడుదల చేయబోతోన్నట్టు అధికారికంగా ప్రకటించారు. వేస‌వి సెలవులను ఈ చిత్రం పూర్తిగా ఉప‌యోగించుకోనుంద‌ని తెలుస్తోంది.

సర్కారు వారి పాట మూవీలో మహేష్ బాబును సరికొత్త అవతారంలో చూపించబోతోన్నారు దర్శకులు పరుశురాం. ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ చేసిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రానికి మ‌హేశ్‌ యాక్షన్ సీక్వెన్స్‌లు హైలెట్ కానున్నాయి.Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Releasing Worldwide In Theatres On May 12th,Keerthy Suresh,,director Parasuram Petla,telugu golden tv,my mix entertainments,teluguworldnow.comఇక సర్కారు వారి పాట టీం ఇప్ప‌టికే మ్యూజిక‌ల్ ప్రమోషన్స్‌ను మొద‌లుపెట్టింది. వాలైంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్ కాబోతుంది. ప్ర‌స్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న సంగీత ద‌ర్శ‌కుడు తమన్ అద్భుతమైన రొమాంటిక్ మెలోడి సాంగ్‌ను రెడీ చేశారని తెలుస్తోంది.

Advertisement

ఈ చిత్రంలో హీరోయిన్ కీర్తి సురేష్ మహేశ్ బాబు ప్రియురాలిగా అల‌రించ‌నుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ ప‌తాకాల‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నటీనటులు: మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు

సాంకేతిక బృందం: రచన‌, దర్శక‌త్వం: పరుశురామ్ పెట్లా, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ , చంట, గోపీ ఆచంట, బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్, సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: ఆర్ మధి, ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, సీఈవో: చెర్రీ, వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: యుగంధర్.

Advertisement
Tags :
Author Image