For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

"సర్కారు వారి పాట" మహా శివరాత్రి స్పెషల్ పోస్టర్

07:10 PM Mar 02, 2022 IST | Sowmya
Updated At - 07:10 PM Mar 02, 2022 IST
 సర్కారు వారి పాట  మహా శివరాత్రి స్పెషల్ పోస్టర్
Advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు భారీ అంచనాలున్న చిత్రం `సర్కారు వారి పాట` నిర్మాణం చివరి దశలో ఉంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.
మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పోస్టర్ను నేడు ఆవిష్కరించారు. సినిమాలో రౌడీ గ్యాంగ్తో మహేష్ బాబు పోరాడే సన్నివేశంలో కనిపిస్తాడు. సినిమాలో మంచి యాక్షన్ డోస్ ఉంటుందని, పోస్టర్ కూడా అదే సూచిస్తోందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇప్పటికే మొదటి సింగిల్ `కళావతికి` 50 మిలియన్లకు పైగా వీక్షణలతో అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్  లో ట్రెండింగ్లో ఉంది. సర్కారు వారి పాట మే 12న సమ్మర్ కానుకగా రాబోతోంది.Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Maha Shivaratri Special Poster Unveiled ,telugu golden tv, my mix entertainments, telguworldnow.comతారాగణం : మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు.
సాంకేతిక సిబ్బంది : రచన, దర్శకత్వం: పరశురాం పెట్ల, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట, బ్యానర్లు: మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్, సంగీత దర్శకుడు: థమన్ ఎస్ఎస్, సినిమాటోగ్రఫీ: ఆర్ మధి, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో-డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, CEO: చెర్రీ, VFX సూపర్వైజర్ - యుగంధర్.

Advertisement GKSC
Advertisement
Author Image