For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

"సూప‌ర్‌స్టార్ కృష్ణ" గారి పుట్టిన‌రోజు సందర్భంగా బుర్రిపాలెం ప్రజలకు కోవిడ్ -19 టీకాలు వేయించిన‌ "సూప‌ర్‌స్టార్‌ మహేష్ బాబు"

02:59 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:59 PM May 11, 2024 IST
 సూప‌ర్‌స్టార్ కృష్ణ  గారి పుట్టిన‌రోజు సందర్భంగా బుర్రిపాలెం ప్రజలకు కోవిడ్  19 టీకాలు వేయించిన‌  సూప‌ర్‌స్టార్‌ మహేష్ బాబు
Advertisement

Superstar Mahesh Babu Sponsors Full Drive of Covid-19 Vaccination For Burripalem On His Father Krishna’s Birthday, Covid Vaccine, Film News,

"సూప‌ర్‌స్టార్ కృష్ణ" గారి పుట్టిన‌రోజు సందర్భంగా బుర్రిపాలెం ప్రజలకు కోవిడ్ -19 టీకాలు వేయించిన‌ "సూప‌ర్‌స్టార్‌ మహేష్ బాబు"

Advertisement GKSC

సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్వగ్రామం బుర్రిపాలెంని దత్తత తీసుకుని తనవంతు సేవలు అందిస్తున్న విష‌యం తెలిసిందే. కేవ‌లం బుర్రిపాలెం వాసుల‌కే కాదు మ‌హేష్ తనవంతు సామాజిక కార్యక్రమాల్ని నిరంతరం చేస్తూనే ఉన్నారు. ఇప్ప‌టికే ఆంధ్రా హాస్పిటల్స్ తో కలిసి 1000 మందికి పైగా పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించారు. హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్` సంస్థతో కలిసి ఆర్థిక అండదండలు లేక వైద్య ఖర్చులను భరించలేని ఎంతో మంది చిన్నారుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.

నేడు (మే 31) తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణపుట్టిన‌రోజు సందర్భంగా బుర్రిపాలెం ప్రజల కోసం కోవిడ్ -19 టీకాల పూర్తి డ్రైవ్‌ను స్పాన్సర్ చేశారు మహేష్ బాబు. వ‌రుస‌గా ఏడు రోజుల‌పాటు ఈ డ్రైవ్ కొన‌సాగ‌నుంది.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో బుర్రిపాలెం మరియు తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు మ‌హేష్‌. ఆ గ్రామాల్లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను అభివృద్ధి చేసే బాధ్యతలను స్వీకరించడం ద్వారా శ్రీమంతుడిగా నిరూపించుకుంటున్నారు. తన తండ్రి కృష్ణ పుట్టినరోజున మహేష్ ఆంధ్ర హాస్పిటల్స్ సహకారంతో బుర్రిపాలెం గ్రామస్తులకు కోవిడ్ -19 టీకాల పూర్తి డ్రైవ్ ను స్పాన్సర్ చేశారు. దీంతో నిజ జీవితంలోనూ సూపర్ హీరోగా మహేష్ పేరు మార్మోగుతోంది. `టీకా అనేది మ‌ళ్లీ మనం సాధార‌ణ జీవితం గడపడానికి ఆశాకిర‌ణం లాంటిది. బుర్రిపాలెం ప్ర‌జ‌లు ప్ర‌తి ఒక్క‌రు టీకా వేసుకుని క్షేమంగా ఉండడానికి ఇది నా వంతు ప్ర‌య‌త్నం. ఈ టీకా డ్రైవ్‌ను ఏర్పాటు చేయడంలో మాకు సహాయపడినందుకు ఆంధ్రా హాస్పిటల్స్‌కు కృతజ్ఞతలు. ఈ క్లిష్ట కాలంలో 'టీమ్ మహేష్ బాబు స‌భ్యులు` స్వచ్చందంగా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించడం అభినందించాల్సిన విషయం. టీకా యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని వేయించుకోవడానికి ముందుకు వచ్చిన గ్రామస్తులందరినీ అభినందిస్తున్నాను. టీకా వేయించుకోండి అందరూ సురక్షితంగా ఉండండి అని సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.

Superstar Mahesh Babu Sponsors Full Drive of Covid-19 Vaccination For Burripalem On His Father Krishna’s Birthday,covid vaccine news,telugu golden tv.my mix entertainments.teluguworldnow.com,1

Advertisement
Author Image