సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన అల్లరి నరేష్ 'నాంది' ట్రైలర్
అల్లరి నరేష్ పూర్తి భిన్నమైన, ఉద్వేగభరితమైన పాత్ర పోషిస్తున్న చిత్రం 'నాంది'. ఈ సినిమా ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌వి2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 19న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానున్నది.
ఈరోజు సూపర్‌స్టార్ మహేష్‌బాబు 'నాంది' ట్రైలర్‌ను విడుదల చేయడం విశేషం. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ సినిమా ట్రైలర్‌ను షేర్ చేసిన మహేష్, "నాంది ట్రైలర్‌ను విడుదల చేస్తున్నందుకు హ్యాపీగా ఫీలవుతున్నాను. ట్రైలర్ ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. అల్లరి నరేష్‌కు, మొత్తం మూవీ టీమ్‌కు బ్లాక్‌బస్టర్ సక్సెస్ రావాలని ఆకాంక్షిస్తున్నాను." అని రాసుకొచ్చారు. సూర్యప్రకాష్‌గా అల్లరి నరేష్ ఓ సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. తన కెరీర్‌లోనే మోస్ట్ చాలెంజింగ్ రోల్‌ను ఈ సినిమాలో నరేష్ పోషించారు.
తారాగణం : అల్లరి నరేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నవమి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి, దేవీప్రసాద్, వినయ్ వర్మ, సి.ఎల్. నరసింహారావు, శ్రీకాంత్ అయ్యంగార్, రమేష్‌రెడ్డి, చక్రపాణి, రాజ్యలక్ష్మి, మణిచందన, ప్రమోదిని, గ్రిగ్నేశ్వర రావు.
సాంకేతిక వర్గం : స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్ కనకమేడల, నిర్మాత: సతీష్ వేగేశ్న, బ్యానర్: ఎస్‌వి2 ఎంటర్‌టైన్‌మెంట్, లైన్ ప్రొడ్యూసర్: రాజేష్ దండా, సినిమాటోగ్రఫీ: సిద్, ఆర్ట్: బ‌్రహ్మ కడలి,ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కథ: తూమ్ వెంకట్, డైలాగ్స్: అబ్బూరి రవి, సాహిత్యం: చైతన్య ప్రసాద్, శ్రీమణి
ఫైట్స్: వెంకట్, పీఆర్వో: వంశీ-శేఖర్.