For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Mishan Impossible: భార‌త‌దేశపు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం

08:52 AM Mar 16, 2022 IST | Sowmya
Updated At - 08:52 AM Mar 16, 2022 IST
mishan impossible  భార‌త‌దేశపు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం
Advertisement

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ మరో కంటెంట్-రిచ్ ఫిల్మ్ `మిషన్ ఇంపాజిబుల్‌`తో వస్తోంది, ఇందులో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తుండగా, `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ దర్శకుడు స్వరూప్ RSJ ఈ మూవీని ఆక‌ట్టుకునేలా రూపొందిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసి టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ నిజానికి సినిమా ప్లాట్‌ లైన్‌ లోని విష‌యాన్ని తెలియ‌జేస్తుంది. అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు అరెస్టు,  ఆ త‌ర్వాత‌ బెయిల్ అనే అంశాన్ని చెబుతూ ఇన్వెస్టిగేటివ్ పాత్రికేయురాలుగా తాప్సీ  డైలాగ్‌తో ప్రారంభమవుతుంది.

Advertisement GKSC

తాప్సీ, తాప్సీ బృందం ఈ మిషన్‌ను నిర్వహించడం దాదాపు అసాధ్యమని భావించినప్పుడు, వారు తక్కువ సమయంలో ధనవంతుడిగా మారిన భార‌త‌దేశపు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి ముగ్గురు పిల్లల సహాయం తీసుకుంటారు. అసాధ్యమైనది ఏమీ లేదని భావించే తాప్సీ పిల్ల‌ల  ధైర్యాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోతుంది. వారు ఈ మిషన్‌ను ఎలా పూర్తి చేస్తారు అనేది కథలో కీలకాంశంగా మారుతుంది.

Superstar Mahesh Babu Launched Theatrical Trailer Of Taapsee Pannu, Matinee Entertainment’s Mishan Impossible,,telugu golden tv, my mix entertainments, teluguworldnow.com.1నిజమైన సంఘటన ఆధారంగా  స్వరూప్ RSJ తన అద్భుతమైన రచన,  టేకింగ్‌తో క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో రూపొందించారు. ట్రైలర్‌లో సూచించినట్లుగా, ఈ చిత్రం అన్ని కమర్షియల్ హంగులను కలిగి ఉండ‌డ‌మే కాకుండా ఇది యాక్షన్,  థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన పూర్తి ఎంటర్‌టైనర్.

Advertisement
Author Image