For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood Updates: అడివి శేష్, సాయీ మంజ్రేకర్ మధ్య రొమాంటిక్‌గా "మేజర్" ఫస్ట్ సింగిల్ "హృదయమా"

10:46 PM Jan 07, 2022 IST | Sowmya
Updated At - 10:46 PM Jan 07, 2022 IST
tollywood updates  అడివి శేష్  సాయీ మంజ్రేకర్ మధ్య రొమాంటిక్‌గా  మేజర్  ఫస్ట్ సింగిల్  హృదయమా
Advertisement

అడివి శేష్ మొదటి పాన్ ఇండియన్ సినిమా మేజర్ విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. శశి కిరణ్ తిక్క దర్వకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించారు. మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు. మేజర్ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ఫస్ట్ సింగిల్ హృదయమా అనే పాటతో మొదలుపెట్టారు. తెలుగు పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయగా.. మలయాళంలో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు.

అడివి శేష్ సాయీ మంజ్రేకర్ మధ్య రొమాంటిక్‌గా ఈ హృదయమా అనే పాట కొనసాగనుంది. శ్రీచరణ్ పాకాల అద్బుతమైన మెలోడి ట్యూన్‌ను అందించగా.. సిధ్ శ్రీరామ్ గాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Advertisement GKSC

సరిహద్దుల్లో మేజర్ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే.. అతని కోసం ఎదురుచూసే ప్రేయసి పాడుకున్నట్టుగా ఈ పాట సాగుతుంది. వారు తమ ప్రేమను లేఖల ద్వారా వ్యక్త పరుచుకుంటూ ఉంటారు. ఇక ఈ లిరికల్ వీడియోలో వారిద్దరి చిన్న నాటి జ్ఞాపకాలను కూడా చూపించారు. ఈ పాటలో మేజర్, ఇషాల మధ్య ప్రేమను అద్భుతంగా చూపించారు.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా మేజర్ సినిమాను తెరకెక్కించారు. ఇందులో మేజర్ సందీప్ బాల్యాన్ని, యవ్వనాన్ని కూడా చూపించనున్నారు. ముంబై అటాక్, మేజర వీర మరణం వంటి సన్నివేశాలన్నీ ఇందులో చూపించబోతోన్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. విజువల్స్, టీజర్‌లోని ఎమోషన్స్ సినిమా మీద అంచనాలు పెంచాయి.Superstar Mahesh Babu, Dulquer Salmaan Released Adivi Sesh Major’s First Single Hrudayama,Sashi Kiran Tikka,Sobhita Dhulipala,telugu golden tv,my mix entertainemts,teluguworldnow.com,శోభితా ధూళిపాళ్ల, సాయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Advertisement
Author Image