"మహేష్ బాబు" బ్రాండ్ అంబాసిడర్ గా సంచలనం సృష్టిస్తున్న "బిగ్ సి"
మొబైల్స్ వినియోగదారులకు అత్యుత్తమ సేవలను, అమ్మకాలను అందించే ఉద్దేశ్యంతో బిగ్ సి 2002 విజయవాడలో శ్రీకారం చుట్టింది, అప్పటికి మొబైల్ మార్కెట్ స్థాయి కేవలం 2% మాత్రమే ఐనా బిగ్ సి వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలు అందించేందుకె అంకితమైంది , మొబైల్ ఫోన్ కొనుగోలు చేయకముందే దానికి సంబందించిన పూర్తి వివరాలను, ఉపయోగించే విధానాన్ని వినియోగదారులకు అందుబాటులో ఉంచడం ద్వారా మొబైల్ ఫోన్ల అమ్మకాల్లో బిగ్ సి ఉన్నతమైన ప్రమాణాలు నెలకల్పింది, 19 సంత్సరాల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో 250 పైగా స్టోర్లను నెలకొల్పి అత్భుతమైన అమ్మకాలతో మూడు కోట్ల మంది వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలతో నేడు బిగ్ సి చరిత్ర సృష్టిస్తోంది.
ఈ నేపథ్యంలో అందాల అగ్రశ్రేణి నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో బిగ్ సి బ్రాండ్ అంబాసిడర్ గ ఒప్పందం చేసుకుంది. ఈ 19 సంవత్సరాల చరిత్రలో ఓ సూపర్ స్టార్ మాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం మాకెంతో గర్వకారణం అని బిగ్ సి డైరెక్టర్లు ఈ సందర్బంగా తెలియచేసారు.
బిగ్ సి లాంటి సంస్థకు బ్రాండ అంబాసిడర్ గా తాను వ్యవహరించడం ఎంతో ఆశ్యర్యకరంగా ఆనందకరంగా ఉందని, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సందర్బంగా తెలియచేసారు, తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 మొబైల్ స్టోర్ గ ఉన్న బిగ్ సి కి మరింత విస్తృతమైన మార్కెట్ ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.