Entertainment : ఘనంగా సుమలత కుమారుడి నిశ్చితార్థం..
Entertainment ప్రముఖ దివంగత నటుడు అంబరీష్, సుమలతల కుమారుడు, నటుడు అభిషేక్ అంబరీష్ జీవితంలో కొత్త జీవితాన్ని మొదలుపెట్టనున్నాడు ఈరోజు తన ప్రియురాలు అబివాతో నిశ్చితార్థం చేసుకున్నాడు.
సుమలత కుమారుడు అభిషేకం బరీష్ తన చిరకాల స్నేహితురాలు ప్రియురాలు అయిన అభివా తో ఆదివారం (డిసెంబర్ 11) ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు సినిమా పరిశ్రమ నుంచి కొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్, కేజీఎఫ్ ఫేమ్ హీరో యష్, మంత్రి ఆర్. అశోక్, అశ్వత్థా నారాయణ్, సుధాకర్ తదితర సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.. అలాగే దీనికి సంబంధించిన ఫోటోలను వీడియోలను సుమలత్ ఎక్కువగా బయటకు రానీయలేదు.. అలాగే ఈ వేడుకలో 'రాకింగ్ స్టార్' యష్, రాధిక పండిట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. నిశ్చితార్థం చేసుకున్న జంటకు యశ్, రాధిక దంపతులు శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే గత ఏడాది అంబరీష్ చనిపోయిన తర్వాత సుమలత తాజాగా వీరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టును ఉంచిన సంగతి తెలిసిందే ఈ పోస్ట్ వైరల్ గా మారింది.. ఎప్పటికి నా జీవితంలో నేను మర్చిపోలేను.. మన బంధంలో నువ్వు ఇచ్చిన జ్ఞాపకాలు ప్రస్తుతం నువ్వు లేవనే బాధను చెరిపేసాయి.. అంటూ అంబరేషన్ తలుచుకొని సుమలత ఎమోషనల్ అయ్యారు..