Entertainment : తెలియకుండానే కళ్ళల్లోంచి వస్తున్న నీటిని చాలా కంట్రోల్ చేసుకున్నా.. సుధీర్
Entertainment కమెడియన్ గా జబర్దస్త్ లో మంచి పేరు తెచ్చుకున్న నటుడు సుడిగాలి సుదీర్ తాజాగా అయినా నటించిన విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతుంది.. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఏర్పాటు చేయగా.. ప్రేక్షకులు తనని ఇంతలా ఆదరిస్తారు అని అనుకోలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు సుధీర్..
సుడిగాలి సుదీర్ హీరోగా నటించిన గాలుడు చిత్రం సక్సెస్మెంట్లో ఎమోషనల్ అయ్యారు ఈ నటుడు.. ప్రేక్షకులు తమ సినిమాపై చూపిస్తున్న ప్రేమ ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు.. అలాగే చిత్రానికి సంబంధించిన ఓపెనింగ్స్ కూడా చాలా బాగున్నాయి అని తనకి ఇప్పటికే చాలామంది కాల్ చేసి చెప్పారని ఈ విషయంపై చాలా ఆనందంగా ఉన్నానని తెలిపారు.. ఈ సందర్భంగా తన గత ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుధీర్..
"2019 డిసెంబర్ 28న సాఫ్ట్‌వేర్ సుధీర్ రిలీజ్ అయ్యింది. దాని తరవాత ఇప్పుడు సోలోగా ‘గాలోడు’తో వచ్చాను. సుమారు మూడేళ్ల విరామం తరవాత థియేటర్‌కు వెళ్తే అంతే ప్రేమ, అంతే అభిమానం, అంతే రెస్పాన్స్, అంతే వైబ్ చూశాను. తెలియకుండానే కళ్లలో నుంచి నీళ్లొచ్చాయి. కానీ చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఇంటికెళ్లిన తరవాత చాలాసేపు ఆనందబాష్పాలు వచ్చాయి’’ అని అన్నారు.. అలాగే కమెడియన్ గా తనను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులు హీరోగా కూడా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపిన సుధీర్.. అయితే ఈ సినిమా మొత్తం ఎంత వసూలు చేసింది అనే విషయాన్ని మరికొన్ని రోజుల్లో పూర్తి లెక్కలతో మీడియా ముందుకు తానే వచ్చే స్వయంగా తెలుపుతానని చెప్పుకొచ్చారు..