For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood Latest Movies: హర్షవర్ధన్ ద‌ర్శ‌క‌త్వంలో హీరో సుధీర్ బాబు 15వ చిత్రం

11:47 PM Dec 20, 2021 IST | Sowmya
Updated At - 11:47 PM Dec 20, 2021 IST
tollywood latest movies  హర్షవర్ధన్ ద‌ర్శ‌క‌త్వంలో హీరో సుధీర్ బాబు 15వ చిత్రం
Advertisement

ప్ర‌స్తుతం ప‌లు ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ల‌తో మ‌న ముందుకు రాబోతున్నారు హీరో సుధీర్ బాబు. తన కెరీర్‌లో 15వ చిత్రంగా హర్షవర్ధన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. సోనాలి నారంగ్‌, సృష్టి స‌మ‌ర్ఫ‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.5గా నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సుధీర్ బాబు కోసం ఒక భిన్న‌మైన క‌థ‌ను రెడీ చేశారు ద‌ర్శ‌కుడు హ‌ర్ష వ‌ర్ధ‌న్‌. ఈ సినిమాలో ఇంత వ‌ర‌కూ చూడ‌ని స‌రికొత్త అవతారంలో సుధీర్ బాబు క‌నిపించ‌నున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ రోజు హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.

Advertisement GKSC

ముహూర్త‌పు షాట్‌కు నిర్మాత పుస్కుర్‌ రామ్‌మోహ‌న్ రావు క్లాప్ కొట్టి స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడికి అంద‌జేశారు. వ‌చ్చే వారం నుండి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

Sudheer Babu, Harshavardhan, Sree Venkateswara Cinemas LLP Production No 5 Launched,Latest Telugu Movies,telugu golden tv,my mix entertainments,teluguworldnow.comఇంకా పేరు పెట్ట‌ని ఈ చిత్రంలో ప్ర‌ముఖ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల‌లో న‌టించ‌నున్నారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా పీజీ విందా సినిమాటోగ్ర‌ఫి భాధ్య‌తలు నిర్వ‌హిస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్ట‌ర్. ఇత‌ర న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో తెలుప‌నున్నారు.

Hero Sudheer Babu, Director Harshavardhan, Producer Puskur Ram Mohan Rao, Sree Venkateswara Cinemas LLP Production No 5 Launched, Telugu golden tv, my mix entertainments, teluguworldnow.com 2

న‌టీన‌టులు: సుధీర్ బాబు
సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌,ద‌ర్శ‌క‌త్వం: హ‌ర్ష వ‌ర్ధ‌న్‌
నిర్మాత‌లు: నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు
స‌మ‌ర్ప‌ణ‌: సోనాలి నారంగ్‌, సృష్టి
బ్యాన‌ర్‌: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి
సంగీతం: చైత‌న్ భ‌ర‌ద్వాజ్
డిఓపి: పీజీ విందా
ఆర్ట్‌: రాజీవ్‌
పిఆర్ఓ: వంశీ - శేఖ‌ర్‌

Advertisement
Author Image