For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

తెలంగాణ‌ డాన్స్ సంస్కృతిని అంద‌రికీ తెలియజేసేలా "స్టోరీస్ అఫ్ తెలంగాణ": అమ‌ల అక్కినేని

10:18 PM Mar 22, 2022 IST | Sowmya
Updated At - 10:18 PM Mar 22, 2022 IST
తెలంగాణ‌ డాన్స్ సంస్కృతిని అంద‌రికీ తెలియజేసేలా  స్టోరీస్ అఫ్ తెలంగాణ   అమ‌ల అక్కినేని
Advertisement

తెలంగాణ‌కు సంబంధించిన సంస్కృతి సంప్ర‌దాయాల‌ను `స్టోరీస్ ఆఫ్ తెలంగాణ‌` డాక్యుమెంట‌రీ ద్వారా చూపించ‌డం అభినంద‌నీయ‌మ‌ని అమ‌ల అక్కినేని అన్నారు. పేర్ని నృత్య రూప‌క‌ర్త డా. న‌ట‌రాజ రామ‌కృష్ణ 100వ జ‌యంతి సంద‌ర్భంగా మార్చి 21 సోమ‌వారం 30 నిముషాల నిడివిగ‌ల‌ డాక్యెమెంట‌రీని ప‌లువురుకి ప్ర‌ద‌ర్శించారు. ఇది కాన్సెప్ట్ క్రియేట‌ర్‌, సినిమాటోగ్రాఫ‌ర్  డి. స‌మీర్ కుమార్ ఆధ్వ‌ర్యంలో రూపొందింది. సుప్రియ యార్ల‌గ‌డ్డ దీనిని నిర్మించారు. ఈ సంద‌ర్భంగా అన్న‌పూర్ణ స్టూడియో మినీ థియేట‌ర్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి అమ‌ల అక్కినేని హాజ‌ర‌య్యారు.

అనంత‌రం అమ‌ల అక్కినేని మాట్లాడుతూ... క్ర‌మ‌శిక్ష‌ణ‌, మ‌న‌లోని అంత‌ర్‌శ‌క్తికి డాన్స్ అనే ప్రక్రియ చ‌క్క‌టి ఫ్లాట్‌ఫామ్ లాంటిది. క‌ళ అనేది బ‌తికున్నంత‌కాలం డాన్స్ వుంటుంది. రుక్ష్మిణీదేవి చెప్పిన‌ట్లు, డాన్స్ అనేది యోగ లాంటిది. మ‌న‌లోని సామ‌ర్థ్యం, శ‌క్తిని వెలికి తీయ‌డ‌మేకాకుండా జీవితంలో ఉన్న‌తంగా ఎలా వుండాల‌నేది తెలియ‌జేస్తుంది. చాలామంది కంప్యూట‌ర్ ముందు కూర్చున్న‌వారు కానీ ఇత‌ర‌త్రా కానీ ప్ర‌స్తుతం ఒత్తిడికి గుర‌వుతున్నారు. ఇలాంటి వారు డాన్స్ చేస్తే అద్భుతంగా యోగ చేసిన‌ట్లుగా వుంటుంది. నా వ‌య‌స్సువారు చేయ‌లేక‌పోయినా యువ‌త ఇది అల‌వ‌ర్చుకోవాలి. డాన్స్ పై డాక్యుమెంట‌రీ చేయ‌డం, అందులోనూ అన్న‌పూర్ణ స్టూడియోస్ నిర్మించ‌డానికి ముందుకు రావ‌డం చాలా గొప్ప‌విష‌యం.  మ‌న సంస్కృతి సంప్ర‌దాయాల‌ను ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ తెలియ‌జేసేలా స‌మీర్ చేసిన ప్ర‌యోగం అభినంద‌నీయం. `Stories of Telangana`- Amala Akkineni that informs everyone about dance culture,Dr. 100th Anniversary of Nataraja Ramakrishna, telugu golden tv, my mix entertainments, teluguworldnow.com.అన్న‌పూర్ణ ఫిలిం స్కూల్ గ్రాడ్యుయేట్ అయిన స‌మీర్‌, ధృవ‌, హ‌లో, అల వైకుంఠ‌పురం వంటి ప‌లు సినిమాల‌కు ప‌నిచేశారు. ఈ డాక్యుమెంట‌రీకి కాన్సెప్ట్, క్రియేట‌ర్‌- డి. స‌మీర్ కుమార్‌, నిర్మాత‌- సుప్రియ యార్ల‌గ‌డ్డ‌, ఎడిట‌ర్‌- సాయి ముర‌ళీ, సంగీతం- క‌ళ్యాణ్ నాయ‌క్‌, సినిమాటోగ్ర‌పీ- డి. సుమీర్ కుమార్‌, సౌండ్ డిజైన్‌- మ‌హేష్‌, వి.ఎప్‌.ఎక్స్‌.- అనిల్‌, క్రియేటివ్ నిర్మాత‌- మ‌హేశ్వ‌ర్ రెడ్డి గోజ‌ల‌.

Advertisement GKSC

Advertisement
Author Image