For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

గత ఏడాది ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లు వచ్చాయి. గర్వంగా చెబుతున్నా.. ఈ ఏడాది ‘దసరా’ వస్తోంది : నాని

11:33 PM Jan 30, 2023 IST | Sowmya
Updated At - 11:33 PM Jan 30, 2023 IST
గత ఏడాది ఆర్ఆర్ఆర్  కేజీఎఫ్ లు వచ్చాయి  గర్వంగా చెబుతున్నా   ఈ ఏడాది ‘దసరా’ వస్తోంది   నాని
Advertisement

యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమాలు భాషా అడ్డంకులను బద్దలు కొడుతున్నాయి. కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే  సినిమా ఆల్-ఇండియన్ సినిమాగా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. సినిమా మరింత లొకలైజ్డ్, ఒరిజినల్, డీప్ రూటేడ్ గా వున్నట్లయితే అది మరింత  యూనివర్సల్ అప్పీల్ ని కలిగివుంటుంది. నేచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ చిత్రం కూడా యూనివర్సల్ అప్పీల్ వున్న చిత్రం. ఇప్పుడు విడుదలైన సినిమా టీజర్ కూడా అదే సూచిస్తుంది. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ‘దసరా’ ‘రా’, రస్టిక్, ఇంటెన్స్ టీజర్ ను లాంచ్ చేశారు.

చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే పండుగ దసరాను భారతదేశం అంతటా చాలా ఆనందం ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ పండుగలో రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని చూపించే సినిమా దసరా. టీజర్‌ను బట్టి చూస్తే  కంటెంట్ ఒరిజినల్, దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Advertisement GKSC

నటీనటుల మేకోవర్‌లు, బొగ్గు గనుల్లో పనిచేసే వ్యక్తుల ప్రపంచాన్ని చూపించడం, వారు అనుసరించే ఆచారాల వరకు.. దసరా టీజర్ సరికొత్త అనుభూతిని అందిస్తుంది. మొదటి ఫ్రేమ్‌లో ధరణి (నాని) భారీ రావణుడి దిష్టిబొమ్మ ముందు నిలబడి ఉన్నట్లు ప్రజంట్ చేశారు. ‘’వీర్లపల్లి.. సుట్టూర బొగ్గు కుప్పలు. తొంగి చూస్తే కానీ కనిపించని వూరు. మందు అంటే మాకు వ్యసనం కాదు. అలవాటు పడిన సాంప్రదాయం’ అని నాని వాయిస్ తో టీజర్ మొదలైయింది. ధరణి ప్రపంచం చాలా వైల్డ్ ఉంది . కొన్ని దుష్టశక్తులు గ్రామంలో సామరస్యానికి భంగం కలిగించినప్పుడు అతని ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాని మాట్లాడుతూ.. దసరా నాకు చాలా స్పెషల్ మూవీ. మార్చి 30 న అందరూ దసరా గురించి మాట్లాడుకుంటారు. అది తప్పితే మరో టాపిక్ వుండదు.  తెలుగు సినిమా గురించి నా కాంట్రిబ్యూషన్ ఏమిటని చాలా సార్లు ఆలోచించే వాడిని. చాలా గర్వంగా ఒక మాట చెబుతున్నాను. తెలుగు, ఇండియన్ సినిమాకి ఈ ఏడాది నా తరపున నుండి బిగ్గెస్ట్ ట్రిబ్యూషన్..  శ్రీకాంత్ ఓదెల. అది ఎందుకో, ఎలాంటి సినిమా తీశాడో మార్చి 30న తెలుస్తుంది. టీజర్ జస్ట్ సాంపిల్ మాత్రమే. సినిమా అదిరిపోతుంది.. నెక్స్ట్ లెవల్ లో వుంటుంది.  గత ఏడాది తెలుగు సినిమా నుండి ఆర్ఆర్ఆర్ వచ్చిన కన్నడ నుండి కేజీఎఫ్ వచ్చింది. చాలా నమ్మకంగా చెబుతున్నాను.. 2023లో తెలుగు సినిమా నుంచి వస్తుంది దసరా. సినిమా విడుదల తర్వాత కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. మార్చి 30 థియేటర్ లో కలుద్దాం’’ అన్నారు.

Advertisement
Author Image