16 రోజుల్లోనే శ్రీశైల మల్లన్నస్వామి హుండీ రికార్డు ఆదాయం ఎంతో తెలుసా?
శ్రీశైల మల్లన్న హుండీ లెక్కింపులో 4.90 కోట్లు.
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు భక్తులు వివిధ రూపాల్లో కానుకలు సమర్పిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గురువారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి మొత్తం రూ.4,90,10,126/-లు నగదు రాబడిగా లభించింది. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 16 రోజులలో సమర్పించినట్లు ఈఓ కె.ఎస్.రామారావు ఓ ప్రకటన లో తెలిపారు.అందులో ఇదే మొట్ట మొదటి సారిగా హుండీ ఆదాయం లభించినట్లు తెలిపారు. అలాగే 21 USA డాలర్లు, 50 ఇంగ్లాండ్ పౌండ్స్, 5 సౌదీ రియల్స్, 5 యూరోస్, 2 సింగపూర్ డాలర్లతో పాటు పలు విదేశీ కరెన్సీ కూడా హుండీ లెక్కింపులో లభించాయి.అక్కమహాదేవి అలంకార మండపములో పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు. దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.
