For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Srikanth Odela:దసరా మూవీ దర్శకుడి పెళ్లి న్యూస్ రివీల్ చేసిన హీరో నాని .. పెళ్లి ఫోటోలు వైరల్ ....

09:03 PM May 31, 2023 IST | Sowmya
Updated At - 09:03 PM May 31, 2023 IST
srikanth odela దసరా మూవీ దర్శకుడి పెళ్లి న్యూస్ రివీల్ చేసిన హీరో నాని    పెళ్లి ఫోటోలు వైరల్
Advertisement

Srikanth Odela:‘దసరా’ (Dasara) దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఓ ఇంటివాడయ్యారు. బ్యాచ్‌లర్ జీవితానికి శుభం కార్డు వేసేసి.. వైవాహిక జీవితానికి క్లాప్ ఇచ్చారు. శ్రీకాంత్ పెళ్లి ఈరోజు కరీంనగర్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో దర్శకుడు సుకుమార్, ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్‌ కేవీ‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నట్టు సమాచారం. అయితే, హీరో నాని మాత్రం ఈ పెళ్లికి హాజరుకాలేకపోయారట. ఆయన ఓ కమర్షియల్ యాడ్ షూట్ కోసం పూణే వెళ్లారని.. అందుకే శ్రీకాంత్ వివాహ వేడుకకు వెళ్లలేకపోయారని సమాచారం.

అయితే, శ్రీకాంత్ ఓదెల పెళ్లి చేసుకున్న విషయాన్ని సోషల్ మీడియాలో ముందుగా రివీల్ చేసింది మాత్రం మన నేచురల్ స్టారే. ‘మన శ్రీకాంత్ ఓదెల పెళ్లి చేసుకున్నాడు. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు అతనికి అందజేయండి’ అని నాని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో నూతన వధూవరుల ఫొటోను కూడా పొందుపరిచారు. కొత్త జంట చిరునవ్వులు చిందిస్తూ చూడముచ్చటగా ఉంది. అయితే, వధువుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement GKSC

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా చేరిన శ్రీకాంత్ ఓదెల.. ఆయన ప్రియ శిష్యుడిగా మారారు. ‘రంగస్థలం’ సినిమాకు చిట్టిబాబు సానాతో కలిసి బ్యాక్‌బోన్‌గా శ్రీకాంత్ నిలిచారు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీకాంత్ ప్రతిభ గురించి సుకుమార్ సభాముఖంగా చెప్పారు. అయితే, ఆ తరవాత చాలా గ్యాప్ తీసుకుని ‘దసరా’ కథతో నేచురల్ స్టార్ నాని దగ్గరకు వెళ్లారు శ్రీకాంత్. ఈ కథ నానీకి విపరీతంగా నచ్చడంతో సినిమాను పట్టాలెక్కించారు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు శ్రీకాంత్.

Advertisement
Author Image