Entertainment : ఎన్నో బాధలు దిగ మింగుతూ జీవితంలో ముందుకు వెళ్లిన అందాల భామ..
Entertainment అతిలోక సుందరి శ్రీదేవి జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయని ఇప్పటికే పలుమార్లు అందరూ చర్చించుకున్న సంగతి తెలిసిందే బయటికి కనిపించినంత అందంగా తన జీవితం అయితే నడవలేదని తెలుస్తోంది ఎంతో అందంగా ఉండే శ్రీదేవి అంతా బయటకే తప్ప తన మనసులో ఎప్పుడూ భయపడుతూనే బతికిందని తెలుస్తోంది అయితే తన జీవిత కాలంలో ఎన్నో కష్టాలను దిగమింగుతూ వచ్చిన ఈమె కొన్నిసార్లు నిర్మాతలు నష్టపోకూడదని కూడా తన బాధను సైతం బయటికి వెల్లడించేది కాదంట తాజాగా ఒకప్పుడు శ్రీదేవి చేసిన ఒక పని చర్చనీయాంశంగా మారింది..
శ్రీదేవి చిత్ర షూటింగ్లో ఉన్న సమయంలో ఆమె తండ్రి మరణించారు అంట అయితే ఈ విషయాన్ని చెబితే షూటింగ్ ఆగిపోయి నిర్మాతకు నష్టం వస్తుందని బాధనంత దిగిమింగుకొని ఆ రోజు షూటింగ్ పూర్తి చేశారంట ఆ తర్వాత మాత్రమే ఆమె మద్రాసు వెళ్లి తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారని సమాచారం అంతేకాకుండా ఈ షూటింగ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగాలని అంత్యక్రియలు పూర్తయిన వెంటనే మళ్ళీ సెట్ కు హాజరయ్యారంట శ్రీదేవి.. అలాగే కుటుంబం కోసం ఎంతగానో పరితపించారు చిన్నతనంలో బాల్యాన్ని సైతం వదులుకొని సినిమాల వెంట పరుగులు తీశారు అయితే ఆ సినిమా జీవితం తనకు ఆహ్వానం పలికినప్పటికీ వ్యక్తిగత జీవితం మాత్రం ఒడిదుడుకులు అయ్యాయి..
20 ఏళ్ల వయసులోనే తండ్రి మరణించిన కొన్నాళ్లకే తల్లి మరణించింది దీంతో తన కుటుంబానికి పెద్దదిక్కు లేకుండా అయిపోయింది ఉన్న చెల్లిని అక్కున చేర్చుకొని పెంచి పెద్ద చేసింది అలాగే ఆమెని హీరోయిన్ చేయడానికి తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తం ఖర్చు పెట్టింది శ్రీదేవి చివరికి ఆ చెల్లెకు ఏమీ కాకుండా అయిపోయింది శ్రీదేవి పైన ఎన్నో అబండాలు వేసి దూరమైపోయింది ఏమి తోచని శ్రీదేవికి అన్నీ తానే అండగా నిలిచారు బోనీకపూర్ అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ శ్రీదేవి ఒంటరి కాకూడదని పెళ్లి చేసుకున్నారు.. నిజానికి శ్రీదేవి బోని కపూర్ కన్నా ముందు బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తితో పెళ్లైనట్టు వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి అయితే చక్రవర్తి భార్య చనిపోతానని బెదిరించి అతన్ని వెనక్కి రప్పించినట్టు తెలుస్తుంది ఇంకా ఆ పరిస్థితుల్లో మిథున్ చక్రవర్తి స్నేహితుడైన బోనికపూర్ శ్రీదేవిని మళ్లీ వివాహం చేసుకున్నారని సమాచారం..