For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

"దొంగలున్నారు జాగ్రత్త" డిఫ‌రెంట్ ఫస్ట్ లుక్ పోస్టర్

08:19 AM Feb 24, 2022 IST | Sowmya
Updated At - 08:19 AM Feb 24, 2022 IST
 దొంగలున్నారు జాగ్రత్త  డిఫ‌రెంట్ ఫస్ట్ లుక్ పోస్టర్
Advertisement

సురేష్ ప్రొడక్షన్స్ అధినేత‌ డి. సురేష్ బాబు, గురు ఫిల్మ్స్ సునీత తాటి సంయుక్తంగా నిర్మించిన ఓ బేబి చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ గా నిలిచింది. ప్ర‌స్తుతం వారి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న రెండవ చిత్రం శాకిని ఢాకిని విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీ సింహ కోడూరితో సురేష్ ప్రొడక్షన్స్ మరియు గురు ఫిలింస్ మూడ‌వ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ఈ థ్రిల్లర్ చిత్రానికి నూతన దర్శకుడు సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ రోజు సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. దొంగలున్నారు జాగ్రత్త అనేది టైటిల్. ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రత్యేకంగా మరియు ఆసక్తికరంగా ఉంది. రోడ్డుపై కారుతో పాటు CC కెమెరా, కేబుల్‌తో కుర్చీకి కట్టివేయబడి శ్రీ సింహ కోడూరి అరుస్తూ కనిపించారు. టైటిల్ లోగో ఆకట్టుకునేలా ఉంది. ఈ డిఫ‌రెంట్  ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రాజెక్ట్ పై క్యూరియాసిటీని పెంచేలాఉంది. దొంగ‌లున్నారు జాగ్ర‌త్త షూటింగ్ చివ‌రిద‌శ‌లో ఉంది.
Sri Simha Koduri, Satish Tripura, Suresh Productions, Guru Films' Dongalunnaru Jagratha First Look Unveiled,telugu golden tv, my mix entertainments, teluguworldnow.com,latest telugu movies.తారాగ‌ణం: శ్రీ సింహా కోడూరి, సముద్రఖని, ప్రీతి అస్రాని

Advertisement GKSC

సాంకేతిక వ‌ర్గం: ప్రొడక్షన్ కంపెనీ: సురేష్ బాబు, గురు ఫిల్మ్స్, నిర్మాత: డి సురేష్ బాబు, సునిత తాటి, డైరెక్టర్: సతీష్ త్రిపుర, కెమెరామెన్: యశ్వంత్ సీ, సంగీతం: రోహిత్ కులకర్ణి, ఆర్ట్: గాంధీ నడికుడికర్, ఎడిటర్: గ్యారీ బీహెచ్
లైన్ ప్రొడ్యూసర్: డి రామ బాలాజీ, మార్కెటింగ్: లిపిక అల్ల, పీఆర్వో : వంశీ-శేఖర్.

Advertisement
Author Image