For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

"ధమాకా" చిత్రంలో ప్రణవిగా "శ్రీ‌లీల" ఫ‌స్ట్‌లుక్

08:32 AM Feb 15, 2022 IST | Sowmya
Updated At - 08:32 AM Feb 15, 2022 IST
 ధమాకా  చిత్రంలో ప్రణవిగా  శ్రీ‌లీల  ఫ‌స్ట్‌లుక్
Advertisement

మాస్ మహారాజ రవితేజ, త్రినాథరావు నక్కినల‌ ఫ‌స్ట్ క్రేజీ కాంబినేషన్‌లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా `ధమాకా` చిత్రం రాబోతోంది. డబుల్ ఇంపాక్ట్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్‌తో ఈ మూవీ రూపొందుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు.

పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. వాలెంటైన్స్ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ప్రేమికుల రోజు కావడంతో రవితేజ, శ్రీలీల జంటగా ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రవితేజ యంగ్ అండ్ డైనమిక్‌గా కనిపిస్తుండగా, శ్రీలీల క్యూట్‌గా కనిపిస్తోంది. వారిద్ద‌రి మ‌ధ్య‌ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో శ్రీలీల పాత్ర పేరు ప్రణవి.Sreeleela’s First Look As Pranavi From Ravi Teja, Trinadha Rao Nakkina, People’s Media Factory, Abhishek Aggarwal Arts’ Dhamaka Revealed,telugu golden tv, my mix entertainments, teluguworldnow.com1నటీనటులు: రవితేజ, శ్రీలీల

Advertisement GKSC

సాంకేతిక బృందం: దర్శకుడు: త్రినాథరావు నక్కిన, నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్,  బ్యానర్స్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, స్టోరీ, డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ, సంగీతం: భీమ్స్ సిసిరిలియో, సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగల.

Advertisement
Author Image