For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Sreeleela: "తెలుగు అమ్మాయిలు ఇంకా రావాలి .. బౌండరీల్ని కరెక్ట్ గా సెట్ చేసుకుంటే మనల్ని ఎవరూ ఆపలేరు" అంటున్న శ్రీలీల ...

11:14 PM Jul 29, 2023 IST | Sowmya
Updated At - 11:14 PM Jul 29, 2023 IST
sreeleela   తెలుగు అమ్మాయిలు ఇంకా రావాలి    బౌండరీల్ని కరెక్ట్ గా సెట్ చేసుకుంటే మనల్ని ఎవరూ ఆపలేరు  అంటున్న శ్రీలీల
Advertisement

Sreeleela : బ్యూటీ విత్ బ్రెయిన్ శ్రీలీలకి ఈ లైన్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లకి కూడా లేనంత క్రేజ్ తెచ్చుకుని ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ అయిపోయింది. 22 ఏళ్ల ఈ యంగ్ హీరోయిన్ అసలు హీరోయిన్లు ఎలా ఉండాలో చెబుతోంది. 22 ఏళ్లైనా తెలుగు నుంచి సౌత్ వరకూ అన్ని ఇండస్ట్రీల్లో హైలెట్ అవుతోంది శ్రీలీల. వరసగా 10 సినిమాలు చేస్తూ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అయిపోయింది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూనే మరో వైపు మెడిసిన్ చదువుతున్న శ్రీలీల అప్ కమింగ్ హీరోయిన్లకి సలహాలిస్తోంది.

శ్రీలీల నిజానికి యంగ్ హీరోయిన్ అయినా అనుకున్న దానికన్నా వచ్చిన స్టార్ డమ్ ని బాగా హ్యాండిల్ చేస్తోంది. అప్పుడే చిన్న సినిమాలకు చీఫ్ గెస్ట్ గా వెళ్లి వాళ్లని కూడా ఎంకరేజ్ చేస్తోంది. రాబోయే హీరోయిన్స్ కి సలహాలిస్తుంది. లేటెస్ట్ గా ఓ సినిమా ఈవెంట్ లో హీరోయిన్స్ కెరీర్ గురించి క్లారిటీ ఇచ్చింది. ఇటీవల సంజయ్, ప్రణవి జంటగా నటించిన స్లమ్ డాగ్ హస్బెండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శ్రీలీల గెస్ట్ గా వచ్చింది. ఈ ఈవెంట్ లో ప్రణవి శ్రీలీలని హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో ఎలా ముందుకెళ్లాలి, ఎలాంటి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటూ పలు ప్రశ్నలు అడిగిందట. వాటితో పాటు తెలుగు హీరోయిన్స్ పై కూడా శ్రీలీల ఈ ఈవెంట్ లో కామెంట్స్ చేసింది.

Advertisement GKSC

శ్రీలీల మాట్లాడుతూ.. అల్లు అర్జున్ సర్ ఇటీవల చెప్పినట్టు తెలుగు అమ్మాయిలు ఇంకా రావాలి. మొన్న వైష్ణవి, ఇప్పుడు ప్రణవి.. ఇలా చాలా మంది ఇండస్ట్రీకి రావాలి. ఇండస్ట్రీ అనేది ఒక డిగ్నిఫైడ్ జాబ్. మా ఫ్యామిలీలో అంతా చదువు వైపే, నేను చదువుకుంటూ ఒక్కసారిగా సినిమాల్లోకి వచ్చాను. ఇది చాలా బోల్డ్ స్టెప్. ఇక్కడికి అందరూ ధైర్యంగా రావాలి, మనల్ని ఎవరూ ఆపరు. డిగ్నిఫైడ్ గా ఉండి, మన బౌండరీల్ని కరెక్ట్ గా సెట్ చేసుకుంటే మనకు అసలు ఎలాంటి ప్రాబ్లమ్ రావు అని తెలిపింది

Advertisement
Author Image