For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Swag : శ్రీ విష్ణు, హసిత్ గోలి, టిజి విశ్వ ప్రసాద్ 'శ్వాగ్' హ్యుమరస్ కాన్సెప్ట్ వీడియో విడుదల

10:21 AM Mar 01, 2024 IST | Sowmya
Updated At - 10:21 AM Mar 01, 2024 IST
swag   శ్రీ విష్ణు  హసిత్ గోలి  టిజి విశ్వ ప్రసాద్  శ్వాగ్  హ్యుమరస్ కాన్సెప్ట్ వీడియో విడుదల
Advertisement

హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి 'రాజ రాజ చోర' కంటే ఎక్కువ ఎంటర్ టైనింగ్ గా ఉండబోతున్న మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ కోసం మళ్లీ కలిశారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీవిష్ణుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మేకర్స్ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు.

సింహం నుండి కిరీటం తీసుకున్న తర్వాత కొత్త నాయకుడిని ఎన్నుకోవడం గురించి అడవిలో జంతువుల మధ్య ఫన్నీ సంభాషణను చూపే కాన్సెప్ట్ వీడియో ద్వారా టైటిల్ అనౌన్స్ చేశారు. సింహం పాత్రకు సునీల్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, కోతి పాత్రకు గంగవ్వ వాయిస్ ఓవర్ ఇచ్చింది. చివరగా, టైటిల్ 'శ్వాగ్' అని రివీల్ అయ్యింది. రాజుగా కనిపించిన శ్రీవిష్ణు కాన్సెప్ట్ వీడియోలో ''మగవాడి ఉనికిని నిలబెట్టిన మా శ్వాగణిక వంశానిది' అని చెప్పిన డైలాగు ఆకట్టుకుంది.

Advertisement GKSC

టీజర్, హిలేరియస్  కాన్సెప్ట్ వీడియోను బట్టి చూస్తే, శ్వాగ్ చిత్రం యూనిక్  కాన్సెప్ట్‌తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని అర్ధమౌతోంది. రాజ రాజ చోరా కోసం పనిచేసిన దాదాపు అదే టీమ్  'శ్వాగ్' కోసం కూడా పని చేస్తుంది. వేదరామన్ శంకరన్ కెమెరా డీవోపీ పని చేస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం సమకురుస్తున్నారు. విప్లవ్ నిషాదం ఎడిటర్. జిఎం శేఖర్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ని చూస్తుండగా, నందు మాస్టర్ స్టంట్స్‌ని పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేస్తారు.

తారాగణం : శ్రీవిష్ణు

సాంకేతిక విభాగం :
నిర్మాత : టి.జి. విశ్వ ప్రసాద్
రచన & దర్శకత్వం: హసిత్ గోలి
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: వేదరామన్ శంకరన్
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటర్: విప్లవ్ నిషాదం
ఆర్ట్ డైరెక్టర్: GM శేఖర్
స్టైలిస్ట్: రజనీ
కొరియోగ్రఫీ: శిరీష్ కుమార్
స్టంట్స్: నందు మాస్టర్
పబ్లిసిటీ డిజైన్స్: భరణిధరన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనునాగవీర
సాహిత్యం: భువన చంద్ర, రామజోగయ్య శాస్త్రి, జొన్నవిత్తుల, నిఖిలేష్ సుంకోజీ, స్వరూప్ గోలి
సౌండ్ డిజైన్: వరుణ్ వేణుగోపాల్
కో-డైరెక్టర్: వెంకీ సురేందర్ (సూర్య)
VFX & DI: దక్కన్ డ్రీమ్స్
కలరిస్ట్: కిరణ్
VFX సూపర్‌వైజర్: వి మోహన్ జగదీష్ (జగన్)
కార్టూన్ అనిమో: థండర్ స్టూడియోస్
డైరెక్షన్ టీం: ప్రణీత్, భరద్వాజ్, ప్రేమ్, శ్యామ్, కరీముల్లా, స్వరూప్

Advertisement
Author Image