For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఔట్ & ఔట్ కామెడీ ఎంటర్ట్ టైనర్ "సాఫ్ట్ వేర్ బ్లూస్" రివ్యూ

03:13 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:13 PM May 11, 2024 IST
ఔట్   ఔట్ కామెడీ ఎంటర్ట్ టైనర్  సాఫ్ట్ వేర్ బ్లూస్  రివ్యూ
Advertisement

నటీ నటులు: శ్రీరాం, భావన ,ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్.రాజు, బస్వరాజ్   తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి

 సాంకేతిక నిపుణులు: నిర్మాతలు: సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్, కథ ,కథనం, దర్శకత్వం: ఉమాశంకర్, సంగీతం: సుభాష్ ఆనంద్,
సినిమాటోగ్రఫీ: నిమ్మ గోపి, ఎడిటర్: వి.కె.రాజు.

Advertisement GKSC

సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మొట్ట మొదటి సినిమా “సాఫ్ట్ వేర్ బ్లూస్”.శ్రీరాం నిమ్మల , భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్. రాజు, బస్వరాజ్ నటీనటులుగా ఉమా శంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మించిన చిత్రం “సాఫ్ట్ వేర్ బ్లూస్”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 24 న గ్రాండ్ గా విడుదల అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్మెంట్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ: భార్గవ్ (శ్రీరాం నిమ్మల),.పిచ్చయ్ (మహబూబ్ బాషా), కె.యస్. రాజు(స్వామి), బస్వరాజ్ (ఓబుల్) ఫ్రెండ్స్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చెయ్యాలని హైదరాబాద్ కు వస్తారు అక్కడ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే యక్ష్య (భావన )హీరోయిన్, కధ పరం గా హీరో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కోసం చూస్తుంటాడు,అదే కంపనీ లో వుండే హీరోయిన్ కి హీరో కి మధ్య ప్రేమ లో పడే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతి ని కలగచ్చేస్తుంది అని చెప్పాలి , అలాగే భార్గవ్, పిచ్చయ్ స్వామి, బస్వ రాజ్ మధ్య జరిగే కామిడీ సన్నివేశాలు సినిమా ని ఒక స్థాయి కి తీసుకెళ్లాయి అని చెప్పాలి, అసలు మధ్యలో భార్గవ్ యక్ష్య ప్రేమ లో మనస్పర్థలు ఎందుకు వస్తాయి,చివరికి యక్ష్య ప్రేమను భార్గవ్ గెలుచుకొన్నాడా లేదా? తను అనుకున్న బెస్ట్ ఎంప్లొయ్ అవార్డు గెలుచుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే సాఫ్ట్ వేర్ బ్లూస్ సినిమా థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు: ఈ చిత్రంలో భార్గవ్ (శ్రీరాం నిమ్మల),.యక్ష్య (భావన) చాలా క్యూట్ గా కనిపించినా చాలా చక్కగా నటించారు. ప్రియురాలిని గాఢంగా ప్రేమించే పాత్రలో భార్గవ్ ఒదిగిపోయాడు. పిచ్చయ్ (మహబూబ్ బాషా), కె.యస్. రాజు(స్వామి), బస్వరాజ్ (ఓబుల్) కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు అని చెప్పవచ్చు మిగలిన పాత్రన్నీ తమ పరిది మేర చాలా చక్కగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు ఉమాశంకర్ గతం లో సాఫ్ట్వేర్ లో ఎంప్లాయ్ కావటం వలన సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో జరిగే కామెడీ సన్నీ వేశాలను బాగా తెరకేక్కించాడు, అన్ని రకాల ప్రేక్షకులు కలిసి ఎంజాయ్ చేసే ఔట్ & ఔట్ కామెడీ ఎంటర్ట్ టైన్ గా ఈ మూవీని చాలా చక్కగా తెరకెక్కించాడు. ఈ సినిమా న్యాచురల్ కైండ్ ఆఫ్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇందులో నటించిన వారెవరూ సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కాకున్నా డెడికేషన్ తో చాలా బాగా నటించారు..హీరో హీరోయిన్స్ చాలా చక్కటి పెర్ఫార్మన్స్ ఇచ్చారు.

సంగీత దర్శకుడు ఈ మూవీకి చక్కటి మ్యూజిక్ అందించాడు. పాటలన్నీ చాలా బాగున్నాయి. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్ నిమ్మ గోపి పనితనం బాగుంది. వి.కె.రాజు ఎడిటింగ్ చాలా క్రిస్ప్ గా వుంది. సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పై నిర్మించిన నిర్మాతలు ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓవరాల్ గా… చెప్పాలంటే మంచి ఔట్ & ఔట్ కామెడీ ఎంటర్ట్ టైనర్ గా తెరకెక్కిన "సాఫ్ట్ వేర్ బ్లూస్". సినిమా చూసిన వారందరరూ కచ్చితంగా కనెక్ట్ అవుతారు.ఈ  సినిమాను నమ్మి థియేట‌ర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని నిరుత్సాహ పరచకుండా అందరినీ ఎంట‌ర్ టైన్ చేస్తుంది అని చెప్పగలను.
రేటింగ్ 3/5Sottware Blues Movie Review,Sreeram Nimmala,Bhawna Choudhary,latest telugu movies,Telugu Golden TV, My Mix Entertainments,v9 news telugu,www.teluguworldnow.com.1

Advertisement
Author Image