For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

స్పైడర్ మెన్ - నో వే హోమ్ ను భారీ ఎత్తున విడుదల చేస్తోన్న సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా

11:41 PM Dec 10, 2021 IST | Sowmya
Updated At - 11:41 PM Dec 10, 2021 IST
స్పైడర్ మెన్   నో వే హోమ్ ను భారీ ఎత్తున విడుదల చేస్తోన్న సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా
Advertisement

మార్వెల్స్ ఆధ్వర్యంలో తెరకెక్కిన స్పైడర్ మెన్ : నో వే హోమ్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. పిటర్ పార్కర్స్‌ సోలోగా తెరకెక్కించిన ఈ మూడో అడ్వెంచర్ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. స్పైడర్ మెన్ : నో వే హోమ్ చిత్రం ఇండియాలో డిసెంబర్ 16న విడుదల కాబోతోంది. ఆ మరుసటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయబోతోంది.

జాన్ వాట్స్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జెండయ, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, జాకబ్ బటలన్, జాన్ ఫెవర్యూ, మరిస టొమి, జె. బీ స్మూవీ, బెనెడిక్ట్ వాంగ్, జామీ ఫాక్స్, ఆల్ఫ్రాడ్ మోలిన, విల్లెమ్ డఫో, థామస్ హడెన్ చర్చ్, రాయిస్ ఇఫాన్స్ ముఖ్య పాత్రలను పోషించారు.

Advertisement GKSC

స్పైడర్ మెన్ : నో వే హోమ్ ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ అయిన నేపథ్యంలో.. సినిమాకున్న డిమాండ్ నేపథ్యంలో వెబ్ సైట్స్ అన్నీ కూడా క్రాష్ అయ్యాయి. అలా జరగడంతో అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Sony Pictures Entertainment India To Release ‘Spider-Man No Way Home’ In English, Hindi, Tamil and Telugu Languages,Director Jon Watts,Zendaya, Benedict Cumberbatch,teluguworldnow.com.1

Advertisement
Author Image