Entertainment : కరోనా విజృంభిస్తున్న వేళ మళ్లీ తన పెద్ద మనసును చాటుకున్న సోను సూద్
Entertainment దాదాపు మూడేళ్లుగా అందర్నీ భయపడుతూ వస్తున్న కరోనా తాజాగా మళ్లీ విజృంభిస్తుంది.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కరోనా కేసులు ప్రతినిత్యం వెలుగులోకి చూస్తూ ఉండగా భారత్లో కూడా మల్లి కరోనా కేసులు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయింది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కరోనా పై ఆంక్షలు విధించాయి ఈ నేపథ్యంలో కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలను ఎంతగానో ఆదుకున్న హీరో సోనుసూద్ మరొకసారి తన ఉన్నత మనసును చాటుకున్నారు..
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే ఆంక్షలు విధించే దిశగా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది అలాగే క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు అడ్డుకట్ట వేసే విధంగా అన్ని సిటీల్లో లాక్ డౌన్ విధించాలని ప్రయత్నిస్తుంది అలాగే ఇప్పటికే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు సైతం కరోనా పై ఆంక్షలు విధించాయి మళ్లీ లాక్ డౌన్ రావచ్చు అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో హీరో సోనోసు నేను ఉన్నాను అంటే మరొకసారి ముందుకు వచ్చారు అలాగే ఇక అరుణ విషయంతో ఎవరైనా ఎక్కడైనా బాధపడిన ఎలాంటి ఇబ్బందులు అయినా ఎదురైనా తనకు చెప్పవలసిందిగా ట్విట్టర్ వేదికగా తెలిపాడు..
బాధితులకు ఎటువంటి అవసరం ఏర్పడినా వెంటనే తాము సహాయం చేయడానికి సిద్ధమని అన్నారు.. అలాగే ఇదే విషయాన్నీ తన బృందానికి సుచినట్లు చెప్పారు. మందులు, ఆక్సిజన్ సిలెండర్లు లేదా మరేదైనా అవసరం ఉంటే.. బాధితులకు వెంటనే సాయం అందించేందుకు నిరంతరం అందుబాటులో ఉండనున్నామని.. తను వీలైనంత మందికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సహాయం కోసం మమ్మల్ని సంప్రదించాలనుకునే వారికీ నిరంతరం అందుబాటులో ఉంటామని.. ఏ ఒక్క ఫోన్ కాల్ ను మిస్ కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.