For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Big Brother : శివ కంఠంనేని తాజా చిత్రం 'బిగ్ బ్రదర్' ఈనెల 24న

02:00 PM May 18, 2024 IST | Sowmya
Updated At - 02:00 PM May 18, 2024 IST
big brother   శివ కంఠంనేని తాజా చిత్రం  బిగ్ బ్రదర్  ఈనెల 24న
Advertisement

"అక్కడొకడుంటాడు, మధురపూడి గ్రామం అనే నేను, రాఘవరెడ్డి" చిత్రాలతో రివార్డులు, అవార్డులు దండిగా పొందిన బహుముఖ ప్రతిభాశాలి శివ కంఠంనేని టైటిల్ రోల్ ప్లే చేసిన "బిగ్ బ్రదర్" సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.

భోజపురిలో అపజయం అనేది లేకుండా దూసుకుపోతూ "రాజమౌళి ఆఫ్ భోజపురి"గా నీరాజనాలు అందుకుంటున్న ప్రముఖ దర్శకులు గోసంగి సుబ్బారావు చాలా విరామం అనంతరం తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ రూపొందించిన "బిగ్ బ్రదర్" చిత్రాన్ని లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై జి.రాంబాబు యాదవ్ సమర్పణలో కె. శివశంకర్ రావు - ఆర్.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. ఘంటా శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఫ్యామిలీ డ్రామా నేపధ్యంలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో శివ కంఠంనేని సరసన ప్రియా హెగ్డే నటించగా... శ్రీ సూర్య, ప్రీతి శుక్లా ఇంకో జంటగా నటించారు!!

Advertisement GKSC

చిత్రం విడుదల సందర్భంగా దర్శకసంచలనం గోసంగి సుబ్బారావు మాట్లాడుతూ... "అన్నదమ్ముల అనుబంధం నేపధ్యంలో... ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్ దట్టించి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం "బిగ్ బ్రదర్". శివ కంఠంనేని మరోసారి ఇందులో అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్ కనబరిచారు. నందమూరి కళ్యాణ్ రామ్ సూపర్ హిట్ చిత్రం "బింబిసార"కు యాక్షన్ కొరియోగ్రఫి చేసిన ఫైట్ మాస్టర్ రామకృష్ణ డిజైన్ చేసిన రొమాంఛిత పోరాటాలు "బిగ్ బ్రదర్" చిత్రానికి బిగ్ ఎట్రాక్షన్. ఈనెల 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేస్తున్నాం. ఈ చిత్రంతో తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఇకపై తెలుగులో వరసగా సినిమాలు చేస్తాను" అన్నారు!!

గౌతంరాజు, గుండు సుదర్శన్, రాజేందర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్-అప్పాజీ, డాన్స్: రాజు పైడి, స్టంట్స్: రామకృష్ణ, ఎడిటింగ్: సంతోష్, కెమెరా: ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు, సమర్పణ: జి.రాంబాబు యాదవ్, నిర్మాతలు: కె.శివశంకర్ రావు - ఆర్.వెంకటేశ్వరరావు, రచన - దర్శకత్వం: గోసంగి సుబ్బారావు!!

Advertisement
Author Image