For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

పాన్ ఇండియా మూవీ 'ఎంగేజ్మెంట్' చిత్రంలో గోల్డెన్ ఛాన్స్ అందుకున్న 'సైరన్' మూవీ హీరో ప్రవీర్ శెట్టి

10:15 PM Jul 05, 2023 IST | Sowmya
Updated At - 10:15 PM Jul 05, 2023 IST
పాన్ ఇండియా మూవీ  ఎంగేజ్మెంట్  చిత్రంలో గోల్డెన్ ఛాన్స్ అందుకున్న  సైరన్  మూవీ హీరో ప్రవీర్ శెట్టి
Advertisement

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న 'ఎంగేజ్మెంట్' సినిమాలో హీరోగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు హీరో ప్రవీర్ శెట్టి. 'సైరన్' అనే కన్నడ సినిమాతో చిత్ర పరిశ్రమలో హీరోగా ప్రవేశించిన ప్రవీణ్ శెట్టి తన నటనాప్రతిభతో అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఎంగేజ్మెంట్ చిత్రం ద్వారా తనలోని పూర్తి నటుడిని తెరపై ఆవిష్కరింపజేసి తెలుగు ప్రేక్షకులకు చేరువ కావాలని అలాగే పాన్ ఇండియా హీరోగా రాణించాలని ఎంతో ఆసక్తితో ఉన్నారు.

దాదాపు 8 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ఎంగేజ్మెంట్' చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉంది. జూలై నెల ఆఖరు నాటికి మొత్తం ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకొని ఆగస్టు మొదటి వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుని వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరపుకుంటున్న 'రేవ్ పార్టీ' చిత్ర దర్శక-నిర్మాత రాజు బొనగాని దర్శకత్వంలో కశ్మీర్, డార్జిలింగ్, కొడైకెనాల్ ,ఉడిపి, గోవా తదితర ప్రదేశాలలో గొప్ప నిర్మాణ విలువలతో నిర్మాత జయరామ్ దేవసముద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement GKSC

రాజు బొనగాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరో ప్రవీర్ శెట్టికి జోడీగా బ్యూటిఫుల్ ఐశ్వర్య గౌడ నటిస్తోంది. ఇటీవల విడుదల అయిన కన్నడ చిత్రం 'ప్రవీణ' మూవీతో హీరోయిన్ ఐశ్వర్య గౌడ సుపరిచితురాలు.

యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైన్మెంట్ తో పాటు చాలా ఆసక్తికరమైన పాయింట్ తో ఈ చిత్రాన్ని పాన్ ఇండియాగా తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, మలయాళంలో చిత్రీకరించబోతున్నారు. 'ఎంగేజ్మెంట్' చిత్రానికి సినిమాటో గ్రాఫర్ గా వెంకట్ మన్నం, సంగీత దర్శకుడిగా దిలిప్ బండారి అలాగే రవి .కె ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు : ప్రవీర్ శెట్టి, ఐశ్వర్య గౌడ తదితరులు

సాంకేతిక నిపుణులు :

బ్యానర్ : రోడియం ఎంటర్ టైన్మెంట్స్ విత్ సూరమ్ మూవీస్
డైరెక్టర్ : రాజు బొనగాని
నిర్మాత : జయరామ్ దేవ సముద్ర.
సహా నిర్మాత : నారాయణ స్వామి. ఎస్.
డిఓపీ :వెంకట్ మన్నం
సంగీతం : దిలీప్ బండారి
ఎడిటర్ : రవి.కె
కో డైరెక్టర్: నాగరాజు. డి
కొరియోగ్రఫర్ : రాజ్ పైడి
ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్
ఆర్ట్ : వెంకట్ ఆరే
డిజైనర్: లక్కీ
పీఆర్ఓ :హరీష్, దినేష్

Advertisement
Author Image