Singer Sunitha : టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న గాయని సునీత కుమారుడు..!
Singer Sunitha : ప్రముఖ గాయని సునీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్ర ముగ్ధులను చేస్తున్న ఆమెకు టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం ఉంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తనదైన శైలిలో రాణిస్తూ లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అందం లోనూ సునీత... హీరోయిన్స్‌కి ఏ మాత్రం తీసిపోదంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న సింగర్ లలో సునీత ఒకరణి ప్రతి ఒక్కరూ చెబుతుంటారు.
అయితే త్వరలోనే సునీత కొడుకు ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు సినీ వర్గా Slot Deposit 5000 ల్లో కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణం గానే సినీ సెలబ్రిటీల విషయానికి వస్తే... తమ పిల్లలను హీరో, హీరోయిన్స్‌గా ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. ఇప్పటికే కూతురు శ్రియాను సింగర్‌గా పరిచయం చేసిన సునీత... కొడుకును మాత్రం హీరోగా వెండితెరపై చూడాలని కలలు కంటుందట. ఇదే విషయాన్ని ఇప్పుడు తాజాగా సునీత కూడా కన్‌ఫర్మ్ చేసింది.
ఈరోజు ఆమె కొడుకు ఆకాష్ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆ పోస్ట్ లో... నిన్ను మంచి నటుడిగా బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని రాసుకొచ్చారు. దీంతో సునీత అభిమానులు కూడా ఆకాష్‌కి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. మరి ఆకాష్ ఏ సినిమాలో నటిస్తున్నారు ? ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగక తప్పదు...