Entertainment ఆ విషయం తప్ప ఏదైనా మాట్లాడండి : సింగర్ సునీత
Entertainment గాయనిగా, నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు సింగర్ సునీత.. అందంతో, అభినయంతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న సునీత గారు.. వృత్తిపరంగా ఎంత పాపులర్ అయినా.. వ్యక్తిగత జీవితాన్నే కొందరు ఫోకస్ చేస్తున్నారు.. ఇలాంటి వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు సునీత..
సాధారణంగా ఎంతో సున్నిత మనస్కురాలైనా సునీత గారిని పదేపదే వ్యక్తిగత జీవితంపై ప్రశ్నలు అడగడంతో తనదైన శైలిలో చురకలాంటించారు. తన కెరీర్లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకు పాటలు పాడానని, 121 మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పానని అన్నారు. అవన్నీ వదిలేసి పదేపదే తన వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు ఫోకస్ చేస్తున్నారని ప్రశ్నించారు. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని.. వాటన్నిటిని తట్టుకొని ఈరోజు నిలబడ్డానని చెప్పుకొచ్చారు. తన పిల్లల ఇష్టప్రకారమే రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకున్నానని చెప్పారు. రామ్ చాలా మంచి వ్యక్తని.. ఆయన చెంత తన జీవితం ఎంతో ప్రశాంతంగా గడిచిపోతుందని అన్నారు.. కొందరు ఎదుటి వారి వ్యక్తిగత జీవితంపై ఎందుకు అంత ఆసక్తి కనబరుస్తారని ప్రశ్నించారు.. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం పూర్తిగా తన వ్యక్తిగతమని.. ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. పనీపాట లేకుండా ఖాళీగా ఉండే వాళ్ళు మాత్రమే ఇలా ఎదుటివారి వ్యక్తిగత జీవితాల్లో చొరబడి వారికి శాంతి లేకుండా చేస్తారని మండిపడ్డారు..తన జీవితంలో ఎదురైనా సమస్యలతో ఒకానొక పరిస్థితిలో తాను ఎంతో డిప్రెషన్ గురయ్యానని.. లెజెండరీ సింగర్ బాలసుబ్రమణ్యం గారు తనకు మెంటర్ల వ్యవహరించి ఆ డిప్రెషన్ నుంచి బయటకు తెచ్చారని చెప్పుకొచ్చారు. సునీత గారు రెండో పెళ్లి విషయం బయటకు వచ్చిన దగ్గరనుంచి ఆమె ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నారు. పెళ్లయి ఏడాది కావస్తున్నా ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు.