Entertainment : ఎప్పుడు అతన్ని ఒంటరిగా కలవకు అంటూ యువనటిని హెచ్చరించిన చిన్మయి..
Entertainment చిన్మయి గాయనిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అయితే ఎప్పటికప్పుడు మహిళలపై జరిగే వేధింపుల విషయంలో మీడియా వేదికగా మాట్లాడటానికి ఎలాంటి సంకోచం లేకుండా ప్రవర్తిస్తుంది. అయితే తాజాగా ఈమె చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
గాయనిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి.. అమ్మాయిల విషయంలో జరిగే వేధింపులను సోషల్ మీడియా వేదికగా బయట పెడుతూనే ఉంటుంది మీటిలో కూడా ఆమె ఆక్టివ్ గా ఉంటూ తనపై జరిగిన విషయాలను చెప్పుకుంటూ వచ్చింది. ఇలా ఆమె కొన్ని సందర్భాల్లో సమస్యలు ఎదుర్కొన్న రోజులు కూడా ఉన్నాయి అలాగే ఒకానొక సమయంలో ఆమెపై బ్యాన్ కూడా విధించింది ఒక ఇండస్ట్రీ అయితే అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా తాజాగా మరొక విషయంలో చర్చకు తెరతీసింది..
మీటూ ఉద్యమం సమయంలో చిన్మయి తమిళ లిరిసిస్ట్ వైరముత్తుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసి.. తనని లైంగికంగా వేధించినట్లు సంచలన ఆరోపణలు చేసింది. అప్పటి నుంచి ఈ వివాదం రగులుతూనే ఉంది. తాజాగా తమిళ యువనటి అర్చన.. తాను వైరముత్తుని కలసినట్లు సోషల్ మీడియాలో పేర్కొంది. ఆ ఫోటోలని కూడా షేర్ చేసింది. అర్చన పోస్ట్ పై చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడూ కూడా అతడిని ఒంటరిగా కలవొద్దని అర్చనని హెచ్చరించింది. 'ఇలాగే మొదలవుతుంది. దయచేసి జాగ్రత్తగా ఉండు. సాధ్యమైనంతవరకు అతడిని దూరం పెట్టు. అతడిని ఒంటరిగా కలవొద్దు. ఒకవేళ కలవాల్సి వస్తే నీ పక్కన ఇంకెవరైనా ఉండేలా జాగ్రత్తపడు. అంటూ చిన్మయి అర్చనని హెచ్చరించింది. సోషల్ మీడియా వేదికగా ఇదంతా జరగటంతో ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది..