FILM NEWS: మన వరంగల్ జిల్లాకు నానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది: శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్ లో నిర్వహించిన ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుంది: శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
సినీ ఇండస్ట్రీలో నానీ ది ప్రత్యేకమైన స్థానం, కథకు తగిన రీతిలో ఆకట్టుకునే అభినయానికి పెట్టింది పేరుగా మనం ఎన్నో సినిమాల్లో వీక్షించాం. మరోమారు అలాంటి ఆకర్షణీయమైన నటనను శ్యామ్ సింగరాయ్‌లో మనం చూస్తాం. 1970 నాటి పాత్రలతో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నేను నమ్ముతున్నాను. మన వరంగల్ జిల్లాకు నానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. గతంలో ఆయన మిడిల్ క్లాస్ అబ్బాయి అనే మంచి సినిమాను మన నగర నేపథ్యంలో నిర్మించారు. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలుసు. అలాంటి హిట్ శ్యామ్ సింగరాయ్ సైతం అందుకుంటుందని కోరుకుంటున్నాను. సినిమా బృందానికి నా తరఫున శుభాకాంక్షలు. కృతజ్ఞతలు.
మన వరంగల్ జిల్లా మంచి షూటింగ్ స్పాట్, సీఎం కెసిఆర్ గారు, మంత్రి కేటీఆర్ గారు వరంగల్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్ చుట్టుముట్టూ మంచి షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి. రామప్ప, లక్నవరం, బొగత వంటి జలపాతాలు, ఏటూరునాగారం అడవులు, వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, భద్రకాళి అమ్మవారు వంటి చారిత్రక ప్రదేశాలెన్నో ఉన్నాయి. రామప్పకి ఈ మధ్యే అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా గుర్తింపు వచ్చింది. ఆయా చోట్ల కూడా షూటింగులు చేయాలని దర్శకులు, నిర్మాతలకు విజ్ఞప్తి చేస్తున్నాను. వరంగల్ లో షూటింగ్ చేస్తే చాలు 100 శాతం సక్సెస్ అని గతంలో సినిమాలు నిరూపించాయి, వరంగల్ లో తీసిన సినిమాలు ఎంత సక్సెస్ అయితున్నాయో మీకు తెలుసు. కాళోజీ కళాక్షేత్రం కూడా ఏర్పాటు చేసినం. సినిమాలను కూడా వరంగల్ ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. చిత్ర యూనిట్ కి మరోసారి శుభాకాంక్షలు! అభినందనలు!! ఆల్ ది బెస్ట్.
త్వరలోనే RRR సినిమా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, చరణ్, రాజమౌలి బృందాన్ని కూడా రప్పిస్తాను, *ఒకప్పుడు సినిమా వాళ్ళు వరంగల్ కి రావాలంటే వచ్చే వాళ్ళు కాదు. *ఇప్పుడు సీఎం కెసిఆర్, కేటీఆర్ ల చొరవ, వరంగల్ సెంటిమెంట్ కూడా ఇప్పుడు బాగా వర్కౌట్ అవుతున్నది, ఈ కార్యక్రమం లో హీరో నాని, హీరోయిన్ సాయి పల్లవి, కృతిషెట్టీ, నిర్మాత వెంకట్ బోయినపల్లి, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్, సాంకేతిక నిపుణులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.