For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: నాకు స్మోకింగ్ అంటే నచ్చదు-ఆరోగ్య సేతు సిగరేట్లను తీసుకొచ్చారు: హీరోయిన్ కృతి శెట్టి

10:13 PM Dec 25, 2021 IST | Sowmya
Updated At - 10:13 PM Dec 25, 2021 IST
film news  నాకు స్మోకింగ్ అంటే నచ్చదు ఆరోగ్య సేతు సిగరేట్లను తీసుకొచ్చారు  హీరోయిన్ కృతి శెట్టి
Advertisement

న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగావిడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం నాడు హీరోయిన్ కృతి శెట్టి మీడియాతో ముచ్చటించారు.

ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్ సినిమాల్లోని పాత్రలకు చాలా తేడా ఉంది. బేబమ్మ పాత్ర కోసం చాలా తెలుగు సినిమాలను చూశాను. ట్రెడిషన్, కల్చర్ గురించి తెలియాలి. విలేజ్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలీదు. శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం ఇంగ్లీష్ సినిమాలు, మోడ్రన్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసుకుని, నా స్టైల్లో నటించాను.

Advertisement GKSC

నాకు వచ్చే పాత్రలపై నేనే రీసెర్చ్ చేసుకుంటాను. ఆ కారెక్టర్ ఎలా ఉంటుంది.. ఆమె అలవాట్లు ఏంటి? ఆమె ఎలాంటి పాటలు వింటుంది అని నేనే సపరేట్‌గా రాసుకుంటాను. శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కీర్తి పాత్రకు తల్లి ఉండదు. తండ్రి పెంపకంలోనే పెరుగుతుంది. అప్పుడు కాస్త మగరాయుడిలా ఉంటే బాగుంటుందని దర్శకుడికి చెప్పాను.

నాకు స్మోకింగ్ అంటే నచ్చదు. కానీ ఈ పాత్ర కోసం అదే చాలెంజింగ్‌గా అనిపించింది. ఆ సీన్స్ తీసేయోచ్చా? అని దర్శకుడిని కోరాను. అది కీర్తి, నువ్ కృతి. తేడా ఉండాలి కదా? అని దర్శకుడు అన్నారు. ఆరోగ్య సేతు సిగరేట్లను తీసుకొచ్చారు. దాంట్లో ఓన్లీ మిల్క్ టేస్ట్ ఉంటుంది. సిగరెట్లను తాగడం మూడు రోజులు ప్రాక్టీస్ చేశాను. మొదటి రోజు ఫోటో షూట్ చేసేటప్పుడు నా చేతులు వణికిపోయాయి.Shyam Singha Roy Movie,Nani,Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian,Latest Telugu Movies,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com.1బోల్డ్ సీన్స్ అంటే అంతా బ్యాడ్ అని అనుకుంటారు. ఏం చేసినా కూడా వృత్తి పరంగానే మేం చేస్తాం. యాక్షన్ సీక్వెన్స్‌లో ఎంత కష్టపడతారో అన్ని సీన్లకు అలానే కష్టపడతారు. అన్ని సీన్లలోనూ నటించినట్టే ఆ సన్నివేశాల్లోనూ నటిస్తాను. ఇండస్ట్రీలోకి రాకముందు నేను ఎక్కువగా సినిమాలు చూడలేదు.

నా ఫ్యామిలీ అంతా ఒక్కో చోట ఉంటారు. సినిమా టికెట్లను నాకు చూపించారు. సినిమాకు వెళ్తున్నామని చెప్పారు. మా నాన్న సినిమాను చూసి నన్ను మెచ్చుకున్నారు. బాగా చేశావ్ అని అన్నారు. ఆయన ఎప్పుడూ కూడా సెట్‌లోకి రారు. నా లుక్ గురించి తెలీదు. కొత్తగా, ఫ్రెష్‌గా ఉందని అన్నారు.

సాయి పల్లవి పాత్ర నాకు చాలా నచ్చింది. నేను కూడా కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. ఆమె స్క్రీన్ మీద చాలా బాగా చేశారనిపించింది. నేను సెట్‌లో సాయి పల్లవిని కలవలేదు. ఓ సారి సెట్‌కు వెళ్లాను గానీ ఆ రోజు సాయి పల్లవి షూటింగ్ లేదు.

Advertisement
Author Image