FILM NEWS: శ్యామ్ సింగరాయ్ బ్లాక్ బస్టర్ క్లాసిక్ సెలబ్రేషన్స్
08:50 PM Dec 30, 2021 IST | Sowmya
Updated At - 08:50 PM Dec 30, 2021 IST
Advertisement
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది.
ఈ సందర్భంగా శ్యామ్ సింగరాయ్ బ్లాక్ బస్టర్ క్లాసిక్ సెలబ్రేషన్స్ ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేచురల్ స్టార్ నాని, రాహుల్ సాంకృత్యాన్, నిర్మాత వెంకట్‌బోయనపల్లి చేతుల మీదుగా చిత్ర యూనిట్‌కు షీల్డ్‌లు అందించారు.
Advertisement