Entertainment : హీరో గానే మిగిలిపోవాలి అని కలగన్నా శోభన్ బాబు ఎన్ని కోట్లు ఇస్తానన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకి నో చెప్పిన టాలీవుడ్ సోగ్గాడు..
Entertainment టాలీవుడ్ లో మొదటి తరం హీరోల్లో ఒకరిగా నిలిచిపోయిన హీరో శోభన్ బాబు తన అందంతో అభినయంతో ఎందరో అభిమానులు సంపాదించుకున్న శోభన్ బాబు మూడున్నర దశాబ్దాల పాటు కేవలం హీరో గానే కనిపించారు అయితే ఆయన హీరోగా ఉన్న సమయంలోనే ఇంక సినిమాలకు గుడ్ బై చెప్పేసారు కొందరు నిర్మాతలు తర్వాత ఎంతగా బతమాలిన ఆయన సినిమాలు చేయలేదు సరి కదా బ్లాక్ చెక్ రాసి ఇస్తామని చెప్పిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు మాత్రం నో చెప్పేశారు అయితే ఆయన కాదన్నా ఎన్నో పాత్రలు చిరకాలం ప్రేక్షకులు మదిలో నిలిచిపోయాయి..
శోభన్ బాబు.. ముఖ్యంగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరెకేక్కిన అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం ముందుగా శోభన్ బాబుని అనుకున్నారంట కానీ ఈయన ఆ పాత్రను చేయాలని సున్నితంగా చెప్పేసారంట.. తర్వాత ఆ పాత్రను నందమూరి బాలకృష్ణ తో చేయించాలి అని అనుకోగా అతను కూడా కాదనటంతో హీరో సుమన్ చేశారు.. అయితే ఈ పాత్రలో ఎంతగానో ఒదిగిపోయారు సుమన్. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుస్వాగతం’లో తండ్రి క్యారెక్టర్ రఘువరణ్ పాత్ర కోసం ఆర్.బి.చౌదరి ముందుగా శోభన్ బాబు గారిని అనుకున్నారు.. కానీ శోభన్ బాబు చేయనంటే చేయనని ఒకేమాట మీద నిలబడ్డారు. అలాగే మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘అతడు’ సినిమాలో తాత పాత్ర కోసం నిర్మాత మురళీమోహన్ శోభన్ బాబు బ్లాక్ చెక్కించారు అంట ఈ పాత్రలు నటించి ఎంతైనా తీసుకోండి అని అనగా చేయనని చెప్పేసారంట శోభన్ బాబు..