శర్వానంద్ ఈ సినిమాలో నవ్వుతూ బాగా చేశాడు: సుకుమార్
`ఆడవాళ్ళు మీకు జోహార్లు`ప్రీరిలీజ్ వేడుక శిల్పకళావేదికలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర టైటిల్ సాంగ్‌ను వ్యాపారవేత్త రాజ సుబ్రహ్మణ్యం, కెమెరామెన్ సుజిత్ సారంగ్ సంయుక్తంగా ఆవిష్కరించారు. మరో గీతాన్ని ప్రముఖ నిర్మాతలు నవీన్ యెర్నేని (మైత్రీ మూవీస్), వెంకట్ బోయినపల్లి (శ్యామ్ సింగరాయ్) ఆవిష్కరించారు. చిత్ర ట్రైలర్‌ను ముఖ్య అతిథులు ప్రముఖ దర్శకుడు సుకుమార్, కీర్తిసురేష్, సాయిపల్లవి సంయుక్తంగా ఆవిష్కరించారు.
అనంతరం సుకుమార్ మాట్లాడుతూ... అందమైన నాయికలు రష్మిక, సాయిపల్లవి, కీర్తిసురేశ్. ముగ్గురూ బెస్ట్ పెర్‌ఫామ్ చేస్తారు. వీరికి సమంత గ్యాంగ్ లీడర్. సాయిపల్లవి లేడీ పవన్ కళ్యాణ్‌లా కనిపిస్తారు. ఈ రంగంలో తనలా వుండడం కష్టం. మానవతా కోణంలో ఆలోచించి ఒక వాణిజ్య ప్రకటనను రిజక్ట్ చేయడంలో సాయి పల్లవి ఆదర్శంగా నిలుస్తారు. నేను దేవీశ్రీ రిజల్ట్ నమ్ముతాను. ఎంతో ఇష్టంగా ఈ సినిమాకు రీరికార్డింగ్ చేశాడు.శర్వాకు అభిమానిని. తను గత రెండు సినిమాల్లో సీరియస్‌గా కనిపించాడు. కానీ ఈ సినిమాలో నవ్వుతూ బాగా చేశాడు. అందులోనే హిట్ కళ కనిపిస్తుంది. నిర్మాత సుధాకర్ సినిమాపై తపనతో తీశారు. ఆయనకు పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఖుష్బూ గారితో ఒకసారి షూట్ చేసే అవకాశం వచ్చింది. ఆమె దగ్గర కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నాను అని తెలిపారు.