For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్న ధీరజ అప్పాజీ

06:27 PM Jun 05, 2023 IST | Sowmya
Updated At - 06:27 PM Jun 05, 2023 IST
ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్న ధీరజ అప్పాజీ
Advertisement

శక పురుషుడు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఫ్.టి.పి.సి)తో కలిసి తెలుగు సినిమా వేదిక నిర్వహించిన వేడుకలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ - అనలిస్ట్ ధీరజ అప్పాజీ "ఎన్టీఆర్ జాతీయ పురస్కారం" అందుకున్నారు.

తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు - ప్రముఖ నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు - ప్రముఖ నటుడు కాశీ విశ్వనాథ్ సంయుక్తంగా అప్పాజీని శాలువాతో సత్కరించి, ఎన్టీఆర్ శత జయంతి జ్ఞాపికతోపాటు, కాంస్య పతకం అందించారు.

Advertisement GKSC

ఈ వేడుకలో ప్రముఖ నటులు ఎమ్.మురళీ మోహన్, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కె.బసిరెడ్డి, ప్రముఖ దర్శకుడు (భాషా ఫేమ్) సురేష్ కృష్ణ తదితర ప్రముఖులు పాలుపంచుకున్నారు.

దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి తనను ఎంపిక చేసి, గౌరవించిన "ఎఫ్.టి.పి.సి ఇండియా" అధ్యక్షుడు చైతన్య జంగా, "తెలుగు సినిమా వేదిక" వ్యవస్థాపకులు "వీస్ వర్మ పాకలపాటి"లకు అప్పాజీ కృతజ్ఞతలు తెలిపారు!!

Advertisement
Author Image