Bollywood Actress Richa : బాలీవుడ్ నటి రిచా చద్దాకి మద్దతుగా ప్రముఖ నటుడు..!
Bollywood Actress Richa : బాలీవుడ్ నటి రిచా చద్దా గత కొంతకాలంగా ట్రోలింగ్ కి గురవుతుంది. ఇండియా నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెప్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల ఓ ట్వీట్ చేశారు. ‘‘పాక్ ఆక్రమించిన కాశ్మీర్‌ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు రెడీగా ఉన్నాం. ప్రభుత్వం ఓకే చెప్తే.. ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఆ సమయంలో పాకిస్థాన్ కాల్పులకి దిగితే మా సమాధానం వేరేలా ఉంటుంది. గవర్నమెంట్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం ’’ అని ఆయన రాసుకొచ్చారు. ఆ ట్వీట్‌కి ‘గల్వాన్ సేస్ హాయ్’ అంటూ రిచా చద్దా రిప్లై ఇచ్చింది.
దీంతో ఆమెపై నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. అలానే పలువురు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ఆమెని విమర్శిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత అశోక్ పండిట్ ఏకంగా జూహు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. అలానే అక్షయ్ కుమార్ , టాలీవుడ్ హీరో మంచు విష్ణు, హీరో నిఖిల్ కూడా రిచా చద్దాను విమర్శిస్తూ ట్వీట్ చేశాడు.
కాగా ఇప్పుడు సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ అనూహ్య రీతిలో ఆమెకు మద్దతుగా నిలిచాడు. రిచా చద్దాని ఉద్దేశిస్తూ అక్షయ్ కుమార్ చేసిన ట్వీట్‌ని ట్యాగ్ చేస్తూ ‘‘ఇలాంటి ట్వీట్‌ని అక్షయ్ కుమార్ నుంచి ఊహించలేదు. మీ కంటే ఎక్కువగా రిచా చద్దాకి ఈ దేశంతో అనుబంధం ఉంది సార్. ఊరికే అడుగుతున్నా’’ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఆ ట్వీట్‌ని డిలీట్ చేసిన రిచా చద్దా వివరణ కూడా ఇచ్చింది. కానీ ఇప్పటికే ఆమెపై పలు స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి.