FILM NEWS: శరవేగంగా కోటి వీక్షణలకు దూసుకుపోతున్న సెహరి టైటిల్ సాంగ్
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సెహరి’. వర్గో పిక్చర్స్ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి, ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ 60 లక్షల వీక్షణలు పొందగా, “సెహరి టైటిల్ సాంగ్”, “ఇది చాలా బాగుందిలే” యూట్యూబ్ నందు యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా “ఇది చాలా బాగుందిలే” అనే పాట 80 లక్షల వీక్షణలు పొంది శరవేగంగా కోటి వీక్షణలకు దూసుకుపోతూ అతి త్వరలో విడుదలకాబోతున్న ఈ చిత్రం పట్ల ప్రేక్షకులలో అంచనాలను పెంచింది. ఈ సందర్భంగా
దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక మాట్లాడుతూ - ``ఈ చిత్రంలోని కధ మరియు పాత్రలు అన్నీ యువత మరియు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాం” అన్నారు.
నటీనటులు: హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి, అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, కోటి, బాలకృష్ణ
సాంకేతిక విభాగం :
దర్శకుడు: జ్ఞానసాగర్ ద్వారక
ప్రొడ్యూసర్స్: అద్వయ జిష్ణు రెడ్డి
డీఓపీ: అరవింద్ విశ్వనాథ్
మ్యూజిక్ డైరెక్టర్: ప్రశాంత్ ఆర్ విహారి
ఎడిటర్: రవితేజ గిరిజాల
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్