For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

సత్యదేవ్ 26, డాలీ ధనంజయ 26 లో మరో హీరోయిన్ గా జెనిఫర్ పిచినెటో

12:36 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:36 PM May 13, 2024 IST
సత్యదేవ్ 26  డాలీ ధనంజయ 26 లో మరో హీరోయిన్ గా జెనిఫర్ పిచినెటో
Advertisement

వెర్సటైల్ హీరో సత్యదేవ్‌, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కలిసి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సత్యదేవ్, డాలీ ధనంజయ ఇద్దరికీ ఇది 26వ ప్రాజెక్ట్. నిర్మాతలు బాల సుందరం, దినేష్ సుందరం ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా క్రిమినల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు నటిస్తున్నారు. ఒక హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్ ని ఇటివలే ప్రకటించారు. ఈ రోజు మరో హీరోయిన్ పేరుని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో మరో హీరోయిన్ పాత్రని జెనిఫర్ పిచినెటో పోషిస్తున్నారు. ఈ మేరకు విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో జెనిఫర్ అల్ట్రా మోడరన్ లుక్ లో ఆకట్టుకుంది.

Advertisement GKSC

వెటరన్ యాక్టర్ సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. కథలో ఆయన పాత్ర చాలా ఇంపాక్ట్ ఫుల్ గా వుండబోతుంది. చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రాఫర్. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

సత్యదేవ్‌, ధనంజయ వైవిధ్యమైన పాత్రలతో అలరించి తమకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నారు. వీరిద్దరూ కలసి చేస్తున్న ఈ సినిమాపై సహజంగానే ప్రేక్షకుల్లో క్యూరీయాసిటీ నెలకొంది.

Satyadev 26, Dolly Dhananjaya 26, Ishwar Karthik, Jennifer Pichineto as another heroine in Old Town Pictures Production No.1,Telugu Golden TV,telugu world news,my mix et,www.teluguworldnow.comతారాగణం : సత్యదేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్,  ప్రియా భవానీ శంకర్, జెనిఫర్ పిచినెటో

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్

అడిషినల్ స్క్రీన్ ప్లే: యువ

నిర్మాతలు: బాల సుందరం, దినేష్ సుందరం

బ్యానర్: ఓల్డ్ టౌన్ పిక్చర్స్

డీవోపీ: మణికంఠన్ కృష్ణమాచారి

సంగీతం: చరణ్ రాజ్

ఎడిటర్: అనిల్ క్రిష్

డైలాగ్స్: మీరాఖ్

స్టంట్స్ : సుబ్బు

కాస్ట్యూమ్ డిజైనర్: అశ్విని ముల్పూరి, గంగాధర్ బొమ్మరాజు

పీఆర్వో: వంశీ-శేఖర్

Advertisement
Author Image