For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

సత్యదేవ్ 26, డాలీ ధనంజయ 26, ఈశ్వర్ కార్తీక్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం. 1 షూటింగ్ ప్రారంభం

12:25 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:25 PM May 13, 2024 IST
సత్యదేవ్ 26  డాలీ ధనంజయ 26  ఈశ్వర్ కార్తీక్  ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం  1 షూటింగ్ ప్రారంభం
Advertisement

వెర్సటైల్ హీరో సత్యదేవ్‌ 26వ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. మల్టీ స్టారర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ డాలీ ధనంజయ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రం ధనంజయ కూడా 26వ చిత్రమే. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1 గా నిర్మాతలు బాల సుందరం, దినేష్ సుందరం క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ ఈరోజు ప్రారంభమైయింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో సత్య దేవ్, ధనంజయ, నిర్మాతలు కనిపించారు. పోస్టర్‌పై కరెన్సీ నోట్లు కూడా కనిపించడం ఆసక్తికరంగా వుంది.

Advertisement GKSC

మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చరణ్ రాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. మీరాఖ్ డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి అనిల్ క్రిష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ప్రముఖ నటీనటులను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.

Advertisement
Author Image