For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

సత్యదేవ్ 26, డాలీ ధనంజయ 26 కీలక పాత్రలో సత్యరాజ్

12:30 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:30 PM May 13, 2024 IST
సత్యదేవ్ 26  డాలీ ధనంజయ 26 కీలక పాత్రలో సత్యరాజ్
Advertisement

వెర్సటైల్ హీరో సత్యదేవ్‌, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కలిసి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో  తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సత్యదేవ్, డాలీ ధనంజయ ఇద్దరికీ ఇది 26వ ప్రాజెక్ట్.

నిర్మాతలు బాల సుందరం, దినేష్ సుందరం ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా  క్రిమినల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

Advertisement GKSC

వెటరన్ యాక్టర్ సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు. కథలో ఆయన పాత్ర చాలా ఇంపాక్ట్ ఫుల్ గా వుండబోతుంది. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు నటించబోతున్నారు,. ఒక హీరోయిన్ గా  ప్రియా భవానీ శంకర్ ఇటీవల నిర్మాతలు ప్రకటించారు.

చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రాఫర్. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సత్యదేవ్‌, ధనంజయ వైవిధ్యమైన పాత్రలతో అలరించి తమకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నారు. వీరిద్దరూ కలసి చేస్తున్న ఈ సినిమాపై సహజంగానే ప్రేక్షకుల్లో క్యూరీయాసిటీ నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ప్రముఖ నటీనటులను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.

తారాగణం: సత్యదేవ్, డాలీ ధనంజయ, ప్రియా భవానీ శంకర్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్
అడిషినల్ స్క్రీన్ ప్లే: యువ
నిర్మాతలు: బాల సుందరం, దినేష్ సుందరం
బ్యానర్: ఓల్డ్ టౌన్ పిక్చర్స్
డీవోపీ: మణికంఠన్ కృష్ణమాచారి
సంగీతం: చరణ్ రాజ్
ఎడిటర్: అనిల్ క్రిష్
డైలాగ్స్: మీరాఖ్
స్టంట్స్ : సుబ్బు
కాస్ట్యూమ్ డిజైనర్: అశ్విని ముల్పూరి, గంగాధర్ బొమ్మరాజు
పీఆర్వో: వంశీ-శేఖర్

Advertisement
Author Image