For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Prem Kumar : ప్రేమ్ కుమార్ అంటూ సంతోష్ ప్రేక్షకులను మెప్పించిన... ప్రేమ్ కుమార్ రివ్యూ అండ్ రేటింగ్!

06:23 PM Aug 18, 2023 IST | Sowmya
Updated At - 06:23 PM Aug 18, 2023 IST
prem kumar   ప్రేమ్ కుమార్ అంటూ సంతోష్ ప్రేక్షకులను మెప్పించిన    ప్రేమ్ కుమార్ రివ్యూ అండ్ రేటింగ్
Advertisement

Prem Kumar : సంతోష్ శోభన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ప్రేమ్ కుమార్. ఈ సినిమా ఆగస్టు 18 2023 నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయానికి వస్తే..

నటీనటులు: సంతోష్ శోభన్,రాశి సింగ్, రుచితా సాధినేని, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీవిద్య, రాజ్ మాదిరాజు, సురభి ప్రభావతి వాటి తదితరులు కీలక పాత్రలలో నటించారు.
నటినటులు: సంతోష్ శోభన్, తదితరులు

Advertisement GKSC

డైరెక్టర్: అభిషేక్ మహర్షి

నిర్మాతలు: శివప్రసాద్ పన్నీరు

మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్. అనంత్ శ్రీకర్

సినిమాటోగ్రఫీ: రాంపీ నందిగాం

కథనం: ప్రేమ్ కుమార్ పాత్రలో (సంతోష్ శోభన్) ఎంతో అద్భుతంగా నటించారు. ఇందులో ఈయనకు ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరదు చివరికి నేత్ర పాత్రలో నటిస్తున్నటువంటి హీరోయిన్ (రాశి సింగ్) తో ఈయనకు వివాహం జరుగుతుంది. తాళి కట్టే సమయంలో రోషన్ బాబు పాత్రలో నటించిన (కృష్ణ చైతన్య )అక్కడికి వచ్చి తాను నేత్రని ప్రేమిస్తున్నానని చెప్పడంతో నేత్రతండ్రి ప్రేమ్ కుమార్ కి కాకుండా రోషన్ బాబుకి ఇచ్చి పెళ్లి చేస్తారు.ఇలా ఆ పెళ్లి మిస్ అవ్వడంతో తిరిగి ప్రేమ్ కుమార్ కి ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరదు.

ఈ క్రమంలోనే ప్రేమ్ కుమార్ తన ఫ్రెండ్ అయినటువంటి కృష్ణ తేజ తో కలిసి డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతారు. ఎవరైతే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అలాంటి వారందరిని విడదీస్తూ ఉంటారు. ఈ సమయంలోనే నేత్ర ప్రేమ్ కుమార్ కంటపడుతుంది. సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించిన రోషన్ నేత్రను కాకుండా అంగన పాత్రలో నటించిన రుచితా సాదినేని ఎందుకు పెళ్లి చేసుకున్నారు...తిరిగి ప్రేమ్ కుమార్ నేత్ర పెళ్లి చేసుకుంటారా లేదా అన్నదే ఈ కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమా కథ అద్భుతంగా ఉంది

మ్యూజిక్

నటీనటుల నటన

మైనస్ పాయింట్స్:

కొన్ని ఎమోషన్స్ అన్ని వేషాలను మరింత బాగా చిత్రీకరించాల్సి ఉంది.

సాంకేతిక విభాగం:

డైరెక్టర్ అభిషేక తొలి ప్రయత్నంలోనే తన అద్భుతమైన పనితీరును బయటపెట్టారు స్క్రీన్ ప్లేస్ డైరెక్షన్ ఎంతో అద్భుతంగా ఉంది. ఇక సినిమాటోగ్రాఫర్ రాంపినందిగం అద్భుతమైన ఫోటోగ్రఫీ అందించారు. ఇక సంగీతం గురించి చెప్పాల్సిన పనిలేదు అద్భుతమైన సంగీతాన్ని అందించారు అనంత శ్రీకర్.

చివరి మాట:

ఒక మంచి డ్రామా ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాని ఒక్కసారి చూడవచ్చు.

రేటింగ్ 3/5

Advertisement
Author Image