Neelambhhari Silks : చేనేత చీరలంటే తనకెంతో ఇష్టమన్న నటి సంయుక్తా మీనన్
హైదరాబాద్, ఏప్రిల్ 2025 : Samyuktha Menon : అందాల నటి సంయుక్త మీనన్ నగరంలో సందడి చేశారు. ఎఎస్‌రావు నగర్‌లోని సాకేత్ మెయిన్ రోడ్, భవానినగర్ లో ఏర్పాటు చేసిన నీలాంబరి సిల్క్స్ తొలి షోరూమ్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేతితో నేసిన పట్టు చీరల కాలానుగుణంగా ఆకర్షణను కలిగి ఉంటాయని అన్నారు. ‘పట్టు చీరలు ప్రతి స్త్రీ వార్డ్‌రోబ్‌లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి, వేడుకల కోసం, వ్యక్తిగతంగా సాంప్రదాయ చీరలను ధరించడం ఇష్టపడతానన్నారు.
ఈ సందర్భంగా నీలాంబరి సిల్క్స్ వ్యవస్థాపకుడు బొజ్జా పురుషోత్తం మాట్లాడుతూ... ‘స్వచ్ఛమైన చేనేత పట్టు పరిశ్రమలో 25 సంవత్సరాల అనుభవం మాది. ఆ అనుభవంతోనే ఎల్లప్పుడూ నాణ్యత, ప్రామాణికత వైవిధ్యంపైనే దృష్టి కేంద్రీకరించాం. మనదేశ చారిత్రక, సాంస్కృతిక, సంప్రదాయాలను పరిరక్షించడంలో తమ బ్రాండ్ నిబద్ధతను కలిగి ఉందని. కంచి, బనారస్, పైథాని, గద్వాల్, మంగళగిరి, వెంకటగిరి నారాయణపేట పట్టు చీరల అద్భుతమైన శ్రేణిని అందుబాటులో ఉంటాయన్నారు.
నటి తో పాటు స్ధానిక శాసనసభ్యులు బండారి లక్ష్మా రెడ్డి కూాడా ఓ విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అందాల తార సంయుక్త మీనన్ కళ్ల ముందు కనపడడంతో అభిమానుల ఆనందం అవధులు దాటింది. హర్షధ్వానాలతో, కేరింతలతో ఆమెకు స్వాగతం పలికారు.