BHAKTHI NEWS: శ్రీమాన్ త్రిదండి చిన జీయర్ స్వామి చేతుల మీదుగా "సమతా స్ఫూర్తి" ఆధ్యాత్మిక గీతం విడుదల
11:22 PM Feb 01, 2022 IST | Sowmya
Updated At - 11:22 PM Feb 01, 2022 IST
Advertisement
శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా అత్యంత వైభవోపేతంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న 216 అడుగుల ఎత్తయిన శ్రీ రామానుజ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి MLA గారి నిర్వహణలో, కాకతీయ ఇన్నోవేటివ్ అధినేతలు లక్ష్మణ్ మురారి & రమేష్ గార్ల ఆధ్వర్యంలో రూపొందించబడిన శ్రీరామనుజం సమతా స్ఫూర్తి అనే ప్రత్యేక ఆధ్యాత్మిక గీతాన్ని ప్రముఖ శాస్త్రీయ, సినీ సంగీత దర్శకులు గాయకులు నిహాల్ కొండూరి గారు సంగీత దర్శకత్వం వహించి ఆలపించగా, కృష్ణవేణి మల్లావజ్జల రచించడం జరిగింది.
ఈ ప్రత్యేక గీతాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామీజీ వారు ఆవిష్కరించి,టీమ్ ను అభినందించారు.
Advertisement